GuidePedia



సినిమా : ప్రతినిధి
చేకోడి రేటింగ్ : 2.75/5
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫి: చిట్టిబాబు
ఎడిటింగ్: నందమూరి హరి
దర్శకత్వం: ప్రశాంత్ మండవ
నటీనటులు: నారా రోహిత్, విష్ణు, శుభ్ర అయ్యప్ప, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, గిరిబాబు, రంగనాథ్
 
బాణం, సోలో చిత్రాలతో ఆకట్టుకున్న నారా రోహిత్ ఆతర్వాత టాలీవుడ్ రేసులో వెనకపడిపోయాడు. ఆతర్వాత వచ్చిన చిత్రాలల్ఓ అనుకున్నంత మేరకు ప్రభావం చూపలేకపోయారు. అతిధి పాత్రలో 'సారొచ్చారు', 'ఒక్కడినే' చిత్రాల తర్వాత నారా రోహిత్ కు టాలీవుడ్ లో పెద్ద గ్యాప్ వచ్చింది. టాలీవుడ్ లో సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న నారా రోహిత్... పొలిటికల్ డ్రామాగా రూపొందిన 'ప్రతినిధి' చిత్రంతో 2004, ఏప్రిల్ 24 తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో టీజర్ తో ఆకట్టుకున్న'ప్రతినిధి' చిత్రం ఎలాంటి టాక్ ను సంపాదించుకుందో తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకోవాల్సిందే. 

కథ : 
శ్రీను (నారా రోహిత్), రాజకీయ అవినీతితో విసుగు చెందిన ఒక వ్యక్తి. దంతి శ్రీను ముఖ్యమంత్రి (కోట శ్రీనివాస్ రావు)ని కిడ్నాప్ చేసి తన భావాలను ప్రజలకు చెప్పలనుకుంటాడు. దీనికోసం మంత్రి (గిరిబాబు) కొడుకైన శ్రీకర్ (శ్రీ విష్ణు) సహాయం తీసుకుంటాడు. శ్రీను ఒక మంచి ప్రణాళికతో ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేస్తాడు. ఈ కిడ్నాప్, దేశం అంతటా సంచలనం రేపుతుంది. పోలీస్ కమీషనర్ (పోసాని కృష్ణ మురళి) కిడ్నాపర్ తో సంప్రదింపులు జరుపుతాడు. ముఖ్యమంత్రిని విడుదల చేయడానికి శ్రీను కొన్ని ఆసక్తి కరమైన డిమాండ్లు కమీషనర్ ముందుంచుతాడు. ప్రస్తుతం ఉన్న ఐదు వందల మరియు వేయి రూపాయల నోట్లని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతాడు, వాటి స్థానంలో మరో కొత్త రూపంలో నోట్లను ముద్రించాలని డిమాండ్ చేస్తాడు. ముఖ్యమంత్రి సహాయ నిధికి డబ్బులు వెళ్ళే విధానంలో స్వల్ప మార్పులు చేయాలని సూచిస్తాడు. ప్రజలు, మీడియా శ్రీనుకి మద్దతు తెలుపుతారు, కానీ పోలీసులు కొన్ని నిజాలు దాస్తారు. అయితే కిడ్నాపర్ నిజంగా శ్రీను ఏనా? లేక అతడు ఒక దెయ్యమా? ఈ
కిడ్నాప్ లో శ్రీకర్ చేసిన సహాయం ఏంటి? అన్నదే ఈ సినిమా కథాంశం.

నటీనటుల ప్రదర్శన :  
ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వాల పనితీరును ప్రశ్నించే శ్రీను పాత్రలో నారా రోహిత్ నటించారు. బాధ్యత కలిగిన పౌరుడిగా నటించిన నారా రోహిత్ కు మంచి మార్కులే పడ్డాయి. అయితే విపరీతంగా లావెక్కడంతో నారా రోహిత్ ను క్లోజప్ ష్టాట్స్ తోనే మేనేజ్ చేయాల్సి వచ్చింది. హీరో పాత్రలకు తగినట్టుగా నారా రోహిత్ తన శరీరాకృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అందరూ సిక్స్ ప్యాక్ తో ఆలరిస్తుంటే నారా రోహిత్ మాత్రం అందుకు భిన్నంగా కనిపించాడు. 
 
హీరోయిన్ శుభ్ర అయ్యప్ప అంతగా గుర్తింపులేని పాత్రనే దక్కింది. హీరో ఫ్రెండ్ పాత్రలో వేణు పర్వాలేదనిపించారు. ఇక ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కోటా శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి పాత్రలు. పోలీస్ ఆఫీసర్ గా పోసాని కామెడితోపాటు, మంచి టైమింగ్ తో డైలాగ్స్ ను పేల్చారు. అయితే పోసాని డైలాగ్స్ లో ఎక్కువ శాతం బీప్ లతో విసిగెత్తించారు. కోట శ్రీనివాసరావును డైలాగ్స్ కే పరిమితం చేశారు. కోటాలోని నటుడిని పూర్తిగా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యారు.
 
ప్లస్ పాయింట్స్: 
నారా రోహిత్ యాక్టింగ్
డైలాగ్స్
సెకాండాఫ్
 
మైనస్ పాయింట్స్: 
ఫస్టాఫ్
 
 సాంకేతిక వర్గం :
 కీలక సన్నివేశాల్లో వచ్చే పాటలకు సాయి కార్తీక్ మంచి సంగీతాన్ని అందించారు. కొన్ని పాటలు ఆకట్టుకోలేకపోయాయి. ఈ చిత్రానికి కథ అందించిన ఆనంద్ రవి.. పవర్ పుల్ డైలాగ్స్ ను అందించారు. ప్రేక్షకులను ఆలోచించే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రతినిధి చితంతో ప్రశాంత్ మండవ మంచి ప్రయత్నమే చేశాడు కాని.. పక్కాగా కథను, కథనాన్ని అందించడంలో తడబాటుకు గురయ్యాడు. సెకండాఫ్ లో తన ఆలోచనలను ప్రేక్షకులకు చేరవేయడంలో తికమక పడ్డారనే చెప్పవచ్చు. పెట్రోల్ ధర, ఇతర ధరల విషయంలో ప్రేక్షకులను చైతన్యపరచడంలో దర్శకుడిగా కొంత మేరకు సఫలమయ్యారు. కథపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టి ఉంటే.. ప్రస్తుత వాతావరణానికి కనెక్ట్ అయ్యేది. తాను చెప్పాలనకున్న అంశాలపై క్లారిటీ మిస్ కావడం ప్రధాన లోపం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఈ సినిమాకి లాబాలు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి.
 
చేకోడి రేటింగ్ : 2.75/5
 
Top