GuidePedia

0

మహేష్ బాబు 'మగడు' కాదంటా !!

ఆగాడు పరాజయం తో చాలా జాగ్రత్తగా కొరటాల శివ సినిమా పైన దృష్టి కేంద్రీకరించాడు మహేష్ బాబు , 2014 సంవత్సరం లో వరసగా రెండు డిసాస్టర్లు చవిచూసిన మహేష్ ఎలాగైనా 2015 లో తన కం బాక్ గట్టిగా ఉండాలి అనే ఉద్దేశం తో ఉన్నాడు . మహేష్ కథల ఎంపిక లో చాలా జాగ్రతగా వ్యవహరిస్తాడు అనే కీర్తి ఉంది అయితే ఇక్కడ ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా లేకపోలేదు దానికి నిలువెత్తు ఉదాహరణే 1- నేనొక్కడినే , ఆగాడు ఫలితాలు . మహేష్ తిరుగులేని స్టార్ గా చిరంజీవి తరవాత ఆ స్థానాన్ని కైవసం చేసుకునే వాడుగా ఎదుగుతున్న క్రమం లో ఈ రెండు అతన్ని దారుణంగా వెనక్కి లాగేసాయి అని చెప్పుకోవచ్చు . అయితే కొరటాల శివ లాంటి మిర్చి డైరెక్టర్ తో మహేష్ తన సత్తా వెనక్కి తెచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది . ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాక మహేష్ కి కూడా సూపర్ కథ తో మెప్పించిన శివ మహేష్ ని కలిసిన దర్శకులలో త్వరగా అంగీకారం తెలిపిన డైరెక్టర్ గా నిలిచాడు , ఈ సినిమా కి 'మగాడు' అనే టైటిల్ ని ఖారారు చేసినట్టు నిన్న దాకా వార్తలు వచ్చాయి .అయితే టైటిల్ ఇంకా ఖరారు కాలేదని స్వయంగా దర్శకుడు తెలియజేసాడు .

Post a Comment

 
Top