GuidePedia

0

శ్రీనువైట్ల పై సెటైర్లు వేస్తున్న కృష్ణవంశీ !!

దసరా పండుగ రాకముందే ఆగడు సినిమా సందడి తగ్గిపోయింది . దాంతో మహేష్ అబిమనులే కాదు పరిశ్రమలో చాలామందికి టార్గెట్-గా మారాడు ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల. గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదల తర్వాత మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్న కృష్ణవంశీ శ్రీనువైట్ల పేరు చెప్పకుండా పరోక్షంగా కామెంట్స్ చేశారు . తానూ గతంలో దర్శకత్వం వహించిన మురారి , చందమామ సినిమాలు విజయవంతం అయ్యాక అదే మూసలో ఉండే సినిమాలు తీయమని చాలామంది నిర్మాతలు తనని బలవంత పెట్టినా ఆ సినిమాల ఛాయలతో ఉండే సినిమాలను తానూ తీయలేదని ఓ సూపర్ హిట్ ఇచ్చిన సినిమా కథను మళ్ళీ మార్చి సినిమాగా తీస్తే జనం చూడరని కామెంట్స్ చేశాడు. అయితే విశ్లేషకులు మాత్రం కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్స్ శ్రీనువైట్లని ఉద్దేశించి అన్నాడు అని అంటున్నారు . దూకుడు సినిమాకి మార్పులు చేసి ఆగడు గా రావడంతో శ్రీనువైట్ల ఘోర పరాజయం అందుకున్న విషయం తెలిసిందే.

Post a Comment

 
Top