GuidePedia



సినిమా : చందమామ కథలు
చేకోడి రేటింగ్ : 2.5/5
మ్యూజిక్, రీరికార్డింగ్: మిక్కి జే మేయర్
సినిమాటోగ్రఫి: సురేశ్ రగుతు
ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల
నిర్మాత: చాణక్య బూనేటి
దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు
నటీనటులు: లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్,  కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, 
రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషి
 
 
ఎల్ బీ డబ్య్లూ (లవ్ బిఫోర్ వెడ్డింగ్), రొటీన్ లవ్ స్టోరీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు మూడో చిత్రంగా చందమామ కథలు చిత్రాన్ని ఏప్రిల్ 25 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.8 డిఫరెంట్ కథల సమూహారంతో తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ మంచు, నరేష్, ఆమని, కిషోర్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్, రిచా పనాయ్, నాగ శౌర్య, శాలిని, అమిత రావు, కృష్ణేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించారు. మిక్కీ జె మేయర్ స్సంగీతం అందించిన ఈ సినిమాని చాణక్య బూనితి నిర్మించాడు. ప్రవీణ్ సత్తారు 8 డిఫరెంట్ కథలను ఒకే కథలా చెప్పాలని చేసిన ‘చందమామ కథలు’ ఎలా ఉంది? ఇంతకీ సినిమాలోని కథలు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం...

కథ :
సారధి (కిషోర్) ఓ రచయిత. అతనికి కావేరి అనే కూతురు ఉంటుంది. కావేరికి లుకేమియా సోకడంతో సారథికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఆస్తిపాస్తులు అంతగా లేని సారథి కూతురు వైద్యానికి కావాల్సిన సొమ్మును ఎలా సంపాదించుకున్నారు?  లుకేమియా నుంచి కావేరి బయటపడిందా? సారథి, కావేరి కథకు మరో ఏడు కథలకు సంబంధమేమిటనే ప్రశ్నలకు సమాదానమే 'చందమామ కథలు' చిత్రం. ఈ 8 కథల్లో వచ్చిన ట్విస్ట్ ల గురించి తెలుసుకోవాలన్నా? అలాగే ఈ 8 కథలకి మధ్య ఉన్న లింక్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ‘చందమామ కథలు’ చూడాల్సిందే..
 
నటీనటుల ప్రదర్శన :
లక్ష్మి మంచు, ఆమని, నరేశ్, కృష్ణుడు, చైతన్య కృష్ణ, అభిజిత్,  కిషోర్, నాగశౌర్య, వెన్నెల కిషోర్, రిచా పనాయ్, షామిలీ అగర్వాల్, కృష్ణేశ్వరరావు, కొండవలస, సురేఖావాణి. రుషిలవి కథపరంగా ప్రాధాన్యం ఉన్న పాత్రలే. ఎవరి పాత్రలకు వారు పూర్తిగా న్యాయం చేకూర్చారు. ముఖ్యంగా బిచ్చగాడి  పాత్రలో రచయిత కృష్ణేశ్వరరావు నటనను ప్రశంసించాల్సిందే. ఇంకా లిసా స్మిత్ గా ఓ మోడల్ గా నటించిన మంచు లక్ష్మి ఓ డిఫెరెంట్ పాత్రతో ఆకట్టుకున్నారు. సారథిగా కిషోర్, కూతురు పాత్రలో కావేరి పూర్తిస్థాయి న్యాయం చేశారు. మిగతా పాత్రలన్నింటికీ అందరూ పూర్తి న్యాయం చేకూర్చారు.
 
పాజిటివ్ పాయింట్స్ : 
దర్శకత్వ పనితీరు
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫోటోగ్రఫి
నటీనటుల పనితీరు
 
మైనస్ పాయింట్స్ : 
ఫస్టాఫ్ నేరేషన్
ఎడిటింగ్
 
 
సాంకేతిక వర్గం :
సాంకేతిక విభాగంలో ముందుగా మెచ్చుకోవాల్సింది సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ. ఎంచుకున్న ప్రతి లొకేషన్ ని బాగా రిచ్ గా చూపించడం వల్ల విజువల్స్ చాలా బాగుంటాయి. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు బాగున్నాయి, అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది కానీ కొన్ని చోట్ల సీన్స్ కి సెట్ అయ్యింది. కానీ కొన్ని చోట్ల అవసరం లేకపోయినా ఎందుకు అంతలా మ్యూజిక్ కొడుతున్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ సినిమాకి ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగతా ఎక్కడా హెల్ప్ అవ్వలేదు.
ఇక మిగిలిన కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వం విభాగాలను ప్రవీణ్ సత్తారు డీల్ చేసాడు. కథ – కథ మంచిదే కానీ ప్రెజెంటేషన్ బాలేకపోవడంతో కథని ఎవరూ పట్టించుకోరు. స్క్రీన్ ప్లే – ఒక సినిమాలో 8 కథలు చెప్పాలనుకున్నప్పుడు స్క్రీన్ ప్లే అనేది అస్సలు గందరగోళంగా ఉండకూడదు. అలా ఉంది అంటే సినిమా ఫెయిల్ కి అదే కారణం అవుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లేలో కూడా క్లారిటీ కంటే గందరగోళం ఉంటుంది. డైలాగ్స్ – రైటర్ పాత్రకి రాసిన డైలాగ్స్ తప్ప మిగతా ఏ డైలాగ్స్ లోనూ పసలేదు. స్టొరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో పెద్దగా మెప్పించలేకపోయిన ప్రవీణ్ సత్తారు డైరెక్టర్ గా మాత్రం మెప్పించాడు. అనుకున్న పాత్రలకు నటీనటులను ఎంచుకోవడంలో, వారి నుంచి నటనని రాబట్టు కోవడంలో, ఆ పాత్రలకి పర్ఫెక్ట్ ఎండింగ్ ఇవ్వడంలో ప్రవీణ్ సత్తారు సక్సెస్ అయ్యాడు. కానీ ఓవరాల్ గా ఆడియన్స్ కి సినిమాని చెయ్యడంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడు. మల్టిప్లెక్స్ ఆడియెన్స్, బీ, సీ సెంటర్లను దృష్టిలో పెట్టుకుని కథల సంకలనంగా రూపొందిన 'చందమామ కథలు' టాలీవుడ్ లో ఓ కొత్త ప్రయోగమే.

 చేకోడి రేటింగ్ : 2.5/5
 
 
Top