GuidePedia

0

రౌడీ ఫెల్లోకి చంద్రబాబు సపోర్ట్ !!

యంగ్ హీరో నారా రోహిత్, విశాఖ సింగ్ జంటగా నటిస్తున్న రౌడీ ఫెలోసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. సెప్టెంబర్ 13 వరకు జరగనున్న ఈ షెడ్యూల్లో రెండు పాటలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం సెప్టెంబర్ 13న గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఇది వరకు తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 13న జెఆర్సి కన్వెన్షన్ హాల్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నాడు. అలాగే పలుగు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది.

Post a Comment

 
Top