రొమాన్స్ కోసం హన్సికని బలవంతపెట్టిన డైరెక్టర్!!
'నేను ముందు నో అనే
చెప్పాను. కానీ ఆ డైరెక్టరే బాగా బలవంతపెట్టాడు. దాంతో ఇక తనకి ఒప్పుకోక తప్పలేదని'
అంటోంది హన్సిక. ఇంతకీ ఆమె దేనికి నో చెప్పింది.. ఆ దర్శకుడు ఆమెని
ఏం బలవంతపెట్టాడు అని ఆరాతీస్తే అసలు సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆర్య, హన్సిక జంటగా తమిళంలో 'మీగమెన్' అని ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ సాంగ్‌లో ఆర్య సరసన హన్సిక
కాస్త మోతాదుకు మించిన ఎక్స్‌పోజింగ్ ఇవ్వాల్సి వుండటంతోపాటు ఆర్యతో ఓ పచ్చి
రొమాన్స్ సీన్‌లో నటించాల్సి వుందట. అయితే ఆమె అందుకు
ససెమిరా అని చెప్పడంతో ఇక డైరెక్టరే నేరుగా రంగంలోకి దిగాడట. ఆమెని కలిసి
మాట్లాడి.. ఈ సీన్ చూడ్డానికి కాస్త ఇబ్బందిగానే అనిపించినప్పటికీ షూటింగ్ అంతా ఓ
పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. ఇందులో నీకొచ్చే ఇబ్బందంటూ ఏమీ వుండదని చెప్పాడట.
ఒకానొక స్టేజ్ లో నటించక తప్పదని బలవంసపెట్టాడట. డైరెక్టర్ చొరవతో హన్సిక ఆ బూతు
సీన్ లో నటించకతప్పలేదని తెలుస్తోంది. సినిమా రిలీజైతే కానీ హన్సిక ఎందుకు నో
చెప్పిందో చెప్పడం కష్టమే.
Post a Comment