GuidePedia

0


చేకోడి రేటింగ్  :   2.5/5
చిత్రం  :  పూజ
బ్యానర్  : విశాల్ ఫిలిం ఫాక్టరీ
సంగీతం  : యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం  : ప్రియాన్
ఎడిటర్  : వి టి విజయన్, టి యస్ జై
రచన : శశాంక్ వెన్నలకంటి
నిర్మాత  : విశాల్
రచన,దర్శకుడు  : హరి 
నటినటులు  : విశాల్, శృతి హాసన్, రాధిక, సత్యరాజ్, సూరి, ముకేష్ తివారి, జయ ప్రకాష్, సితార, అభినయ తదితరులు

విశాల్ తెలుగు వాడైనప్పటికీ, వీరి కుటుంబం చెన్నయ్ లో సెటిలయ్యింది. అయినా సరే విశాల్ చక్కగా తెలుగు మాట్లాడగలడు. తమిళంలో హీరోగా పరిచయం అయ్యి తను చేసే ప్రతి చిత్రం తెలుగులో డబ్ అయ్యేలా చూసుకుంటున్నాడు విశాల్. తెలుగు వెర్షన్ కోసం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. వాటి అధర్మగా ఇతగాడి సినిమాలు హిట్ , ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగులో విడుదలవుతున్నాయి మార్కెట్ కూడా అవుతున్నాయి. తాజాగా తను నటిస్తూ, నిర్మించిన 'పూజ' చిత్రాన్ని కోలీవుడ్ లో విడుదలైన రోజునే తెలుగులో కూడా విడుదల చేసాడు విశాల్. పక్కా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలకు దర్శకత్వం వహించే హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.

కథ : వైజాగ్ మార్కెట్ లో వడ్డీకి డబ్బులు ఇస్తూ జీవితం కొనసాగిస్తుంటాడు వాసు (విశాల్). ఓ రోజు అనుకోకుండా వాసు దివ్య (శృతి హసన్) ని కలుస్తాడు. అప్పుడు మొదలయిన వారి స్నేహం మెల్లగా ప్రేమ వైపు మరులుతుంది. ఇదిలా నడుస్తుండగా సింగన్న పాత్రుడు (ముఖేష్ తివారి) బొబ్బిలి లో గుడికి ధర్మకర్త , బయట సమాజానికి గౌరవప్రదంగా కనిపించే సింగన్న కాంట్రాక్టు తీసుకొని మనుషులని చంపుతుంటాడు. తెలివిగా ప్లాన్ చేసి మరి చంపుతుంటాడు. అతన్ని పట్టుకోవడానికి వచ్చిన అధికారి శివారం నాయక్ (సత్యరాజ్) ని చంపించడానికి కాంట్రాక్టు తీసుకుంటాడు సింగన్న. అలా ప్లాన్ చేసి చంపే సమయంలో వాసు అక్కడే ఉండడంతో శివరాం ని కాపాడుతాడు. తను చేసిన ప్లాన్ బెడిసి కొట్టడంతో వాసుని ఎలా అయిన వెతికి పట్టుకోమని చెబుతాడు సింగన్న. ఇందే సమయంలో ధర్మకర్తగా ఉన్న గుడికి ధర్మకర్తగా గోకరాజు కంపెనీ అధినేత ప్రయత్నించడంతో అతన్ని సింగన్న అవమానిస్తాడుఈ విషయంగా సింగన్నని వాసు కొడుతాడు. అసలు గోకరాజు కుటుంబానికి వాసుకి ఉన్న సంబంధం ఏమిటి? సింగన్న కి తన ప్లాన్ చెడిపోయింది వాసు వలనే అని ఎలా తెలుస్తుంది? తెలిసాక ఏమి చేశాడు? అనేది మిగిలిన కథ

నటినటులు : యాక్షన్ సినిమాల్లో ఒదిగిపోవడం విశాల్ కి పెద్ద కష్టమేం కాదు. అతని గత చిత్రాలు 'పందెం కోడి', 'భరణి' చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. రొటీన్ అయిపోతున్నాడనే పేరుని పోగొట్టుకోవడానికి ఇటువంటి పాత్రలని పక్కకు పెట్టిన విశాల్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ రూట్లోనే వచ్చాడని అతనికే తెలియాలి.

శృతి హసన్ స్టాండర్డ్ కమర్షియల్ సినిమా హీరోయిన్ పాత్రలు చేసింది. నటించాల్సిన అవసరమే లేని పాత్రలో శ్రుతి హసన్ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఉనికిని చాటుకుంది.

సత్యరాజ్ పాత్రకి బిల్డప్ ఎక్కువ ఇచ్చారు కానీ అయన పాత్ర ఏమాత్రం ఎఫెక్టివ్ గా లేదు. రాధిక పాత్రని పూర్తిగా వృదా చేశారు అనిపించింది. ముఖేష్ తివారి పాత్ర సరిగ్గా తీర్చిదిద్దలేదు అదే రొటీన్ పాత్ర. హీరో స్నేహితుడు పాత్రలో సూరి చేసిన కామెడీ అక్కడక్కడ పేలింది. తెరపై మొత్తం ఆర్టిస్టులతో నింపేశారు . చిన్న చిన్న పాత్రలకి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు. కానీ వారు చేసేందుకు సినిమాలో ఏమి లేకుండా పోయింది.

సాంకేతిక వర్గం :  సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకుని, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో  ప్రేక్షకులను కట్టిపడేయడం డైరెక్టర్ హరికి బాగా తెలుసు. ఈ సినిమా కూడా అలానే ఉంది. కాకపోతే సింఫుల్ స్టోరీ లైన్ తీసుకున్న హరి, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే చేయడంలో మాత్రం ఈ సినిమా పరంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. కొన్ని సీన్స్ లో తన మార్క్ కనిపించిన చాలా చోట్ల ఆ మార్క్ మిస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే.. అలాగే ఎప్పటిలానే హరి స్టైల్ టిపికల్ కెమెరా మూవింగ్ (ఫాస్ట్ కెమెరా మూవింగ్) ఇందులో కూడా ఉంటుంది. యవన్ శంకర్ రాజా తెలుగులోనే కాదు తమిళంలోనూ పాటులు హిట్స్ ఇవ్వలేకపోతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చారు. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ కొన్నిబోర్ అనిపించాయి. కొన్ని కామెడీ పంచ్ లు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :
·        విశాల్, శృతి హాసన్
·        అక్కడక్కడ కామెడీ
·        బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

డ్రా బాక్స్ :
·        సెకండ్ హాఫ్
·        రొటీన్ కథ, కథనం
 
చివరిగా :  తన కెరీర్ మొదటి నుంచీ కేవలం మాస్ ప్రేక్షకులు నా సినిమా చూస్తే చాలు అన్నట్లు తీస్తూ వస్తున్నారు దర్శకుడు హరి. అయితే ఎపుడో ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘స్వామి’ 'సింగం'  లాంటివి అన్ని వర్గాల వారిని అలరించాడు. కానీ ఆయన మాత్రం తన నమ్మిన దారిని వదలలేదు. ఆయన కూడా మొహమాటపడకుండా మొదట యాక్షన్ సీన్స్ డిజైన్ చేసుకుని తర్వాత వాటికి తగ్గ కథని అల్లే ప్రయత్నం చేస్తూంటారు. అలాంటి మరో ప్రయత్నమే...ఈ పూజ. ఒక టాలీవుడ్ లోనే కాదు... అన్ని వుడ్స్ లోను  పరమ రొటీన్ చిత్రాలే వస్తున్నాయని..మనం వారిని చూసి భాధపడక్కర్లేదని ఈ చిత్రం మరో మారు ప్రూవ్ చేస్తుంది. ఇక కథ,కథనం వంటి వాటికి సంభంధం లేకుండా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ ని చూసి ఇష్టపడే వారు ఈ పూజ చేసుకోవచ్చు. ఫలితం దక్కుతుంది.

Post a Comment

 
Top