GuidePedia


రివ్యూ : హృదయ కాలేయం 
విభాగం : కామెడీ
బ్యానర్ : అమృత ప్రొడక్షన్ , విఎస్ఎస్ క్రియేషన్స్ 
సంగీతం : ఆర్ . కే
కూర్పు : కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ : చిరంజీవి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నిర్మాత, దర్శకత్వం :  సాయి రాజేశ్ ( స్టిఫెన్ శంకర్ )
చే"కోడి" రేటింగ్ : 2.5/5


అమృతా ప్రొడక్షన్స్‌, వి.ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌
అమృతా ప్రొడక్షన్స్‌, వి.ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌
రివ్యూ: హృదయ కాలేయం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అమృతా ప్రొడక్షన్స్‌, వి.ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌
తారాగణం: సంపూర్ణేష్‌ బాబు, కావ్యా కుమార్‌, ఇషికా సింగ్‌ తదితరులు
సంగీతం: ఆర్‌.కె.
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: చిరంజీవి
రచన, నిర్మాత, దర్శకత్వం: స్టీవెన్‌ శంకర్‌ (సాయి రాజేష్‌)
విడుదల తేదీ: ఏప్రిల్‌ 4, 2014 - See more at: http://telugu.greatandhra.com/movies/reviews/review-hrudaya-kaleyam-51651.html#sthash.CtB4mEi6.dpuf
రివ్యూ: హృదయ కాలేయం
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: అమృతా ప్రొడక్షన్స్‌, వి.ఎస్‌.ఎస్‌. క్రియేషన్స్‌
తారాగణం: సంపూర్ణేష్‌ బాబు, కావ్యా కుమార్‌, ఇషికా సింగ్‌ తదితరులు
సంగీతం: ఆర్‌.కె.
కూర్పు: కార్తీక శ్రీనివాస్‌
ఛాయాగ్రహణం: చిరంజీవి
రచన, నిర్మాత, దర్శకత్వం: స్టీవెన్‌ శంకర్‌ (సాయి రాజేష్‌)
విడుదల తేదీ: ఏప్రిల్‌ 4, 2014 - See more at: http://telugu.greatandhra.com/movies/reviews/review-hrudaya-kaleyam-51651.html#sthash.CtB4mEi6.dpuf
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న సంపూర్నేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘హృదయ కాలేయం’. ‘ఎ కిడ్నీ విత్ హార్ట్’ అనే ఉపశీర్షిక ఉన్న ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాయి రాజేష్ నీలం నిర్మాత. సంపూర్నేష్ బాబు సరసన ఇషిక సింగ్, కావ్య కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఆర్.కె మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సోషల్ మీడియాలోనే కాకుండా ‘హృదయ కాలేయం’ మూవీతో కూడా సంపూర్నేష్ బాబు సంచలనం సృష్టించాడేమో ఇప్పుడు చూద్దాం.
కథ : 

సిటీలోని పోలీస్ డిపార్ట్ మెంట్ సిటీ ఎలక్ట్రికల్ షాప్స్ లో జరుగుతున్న దొంగను పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంటారు. కానీ పట్టుకోలేక పోతుంటారు. అతనే సంపూర్నేష్ బాబు(సంపూర్నేష్ బాబు) అని కొద్ది రోజులకి తెలుస్తుంది. దాంతో అతన్ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ టీంని రంగంలోకి దించుతారు. ఎలాగో కష్టపడి పోలీసులు సంపూర్నేష్ బాబుని పట్టుకుంటారు.
పోలీసులు అసలు సంపూర్నేష్ దొంగగా ఎందుకు మారాడు అని అడగడంతో సంపూ తన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఒక మెకానిక్ అయిన సంపూర్నేష్ తన ప్రేమకోసమే ఇదంతా చేస్తున్నాడని తెలుస్తుంది. అసలు తన పూర్తి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ప్రేమ కోసం దొంగతనాలు చేయటం ఏంటి? అనే పలు రకాల విషయాలకు సమాధానం కావాలంటే మీరు ‘హృదయ కాలేయం’ సినిమా తప్పక చూడాల్సిందే.

నటీనటుల పనితీరు :

సంపూర్నేష్ బాబు తన నటనతో ఇప్పటి వరకూ పోస్టర్స్, ట్రైలర్స్ లో మాత్రమే సంచలనం సృష్టించిన సంపూ ప్రేక్షకులను మెప్పించడంలో కూడా ఎక్కడా నిరుత్సాహపరచలేదు. సినిమా మొత్తం తన కామెడీ , డైలాగ్స్ మరియు డాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తూనే ఉన్నాడు. హీరోయిన్ కావ్య కుమార్ చూడటానికి బాగుంది అలాగే, తన పాత్ర వరకూ బాగానే చేసింది. అలాగే మరో హీరోయిన్ ఇషిక సింగ్ పాత్రకి అస్సలు క్లారిటీ లేదు, అలాగే మరికొన్ని పాత్రలకి కూడా ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్తాయి అన్న క్లారిటీ లేదు. పోలీస్ ఆఫీసర్ తో కామెడీచేయించాలని చుసిన అది ఫలించలేదు.

సాంకేతిక వర్గం పనితీరు :
చిరంజీవి సినిమాటోగ్రఫీ పరువాలేదు అనిపించింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ విజువల్స్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. ఆర్.కె అందించిన పాటలు పరవాలేధనిపించాయి. ఎడిటింగ్ ఓకే కానీ సెకండాఫ్ లో ఒక 10-15 నిమిషాలు కట్ చేసి ఉండొచ్చు.ఇక డైరెక్టర్ స్టీవెన్ శంకర్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ విభాగాలను హ్యాండిల్ చేసాడు. కథలో పెద్ద లాజిక్ లేకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు. దాని వల్ల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాగే సంపూకి రాసిన వన్ లైన్ పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ ని తెగ నవ్వించాయి. అలాగే మొదటి సినిమాతో డైరెక్టర్ గా స్టీవెన్ శంకర్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 👍ప్లస్ పాయింట్స్ :
  • సంపూర్నేష్ బాబు 
  • పంచ్ డైలాగ్స్
  • కామెడీ

👎మైనస్ పాయింట్స్ :
  •  ఫేస్ బుక్ మినహా సంపూ మిగిలిన వారికీ తెలియక పోవడం
  • సెకండ్ హాఫ్ మరి ఓవర్ చేసారు 
  • వెస్ట్ క్లైమాక్స్ 
  • కేవలం సంపూ తెలిసిన వారే ఆ కామెడీ ఎంజాయ్ చేస్తారు 
రివ్యూ : చే"కోడి"
 
Top