GuidePedia

0

 చేకోడి రివ్యూ : ప్రేమను ఆపేదెవరు !!


రివ్యూ: ప్రేమను ఆపేదెవరు  
చేకోడి రేటింగ్‌: 4/5
బ్యానర్‌: ఐ క్లిక్ మూవీస్.
తారాగణం:  వరుణ్ రావు, దివ్య
సంగీతం: గూగుల్, యుట్యూబ్
  
కూర్పు: డి. మల్లేష్  
ఛాయాగ్రహణం: శివ శంకర వర ప్రసాద్  
నిర్మాతలు: ఐ క్లిక్ మూవీస్, వి.ప్రొడక్షన్స్       
కథ, మాటలు, కథనం, దర్శకత్వం: శ్రీకాంత్.వంగా


ప్రేమను ఆపేదెవరు అనే షార్ట్ ఫిలింలో  డైలాగ్స్ గత కొన్ని రోజులుగా పేస్ బుక్ లో, ట్విట్టర్ లో హాల్ చల్ చేస్తునాయి..

ఈ షార్ట్ ఫిలిం స్టొరీ, రివ్యూ ఒకసారి చూద్దాం...


 “పెళ్లి చేసుకోవడం మీ మానసిక ఆరోగ్యానికి  మరియు ఆర్థిక భద్రత కి హానికరం” “ఆడది ఎంత పీడగా తయారైందంటే దాని వల్ల మగాడు జ్ఞానోదయం గురించి ఆలోచింటం మొదలు పెట్టాడు”,షార్ట్ ఫిలిం ముందు చెప్పి ఆడ వాళ్ళు మరియు పెళ్లి  మీద వున్నా పగ ని తీర్చుకునాడు దర్శకుడు...


కథ:

పెళ్లి అంటే నమ్మకం లేని ఒక అబ్బాయిని,  అమ్మాయి ప్రేమించాటమే ఈ షార్ట్ ఫిలిం కథ, ప్రేమ కి ప్రేయసి, పెళ్లి రెండు అవసరం లేదు అనే చెప్పటమే ఈ లఘు చిత్ర ఉద్దేశం..


సాంకేతిక వర్గం పనితీరు:

 ఈ షార్ట్ ఫిలిం లో స్క్రీన్ ప్లే ప్రధాన పాత్ర పోషించింది, పెళ్లి గురించి హీరో పాత్ర చెప్పే విషయాలు ఎక్కడ బోర్ కొట్టకుండా  చాలా చాకచక్యం గా చిత్ర దర్శకుడు  శ్రీకాంత్ వంగా తీసాడు. హీరో హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ లోనే  తన  ఇంటలిజెన్స్ ని చూపెట్టాడు. ముఖ్యం గా స్క్రీన్ ఫై వచ్చే  హీరో హీరోయిన్ ల లవ్ స్కోర్ స్టొరీ లో ఉన్న డెప్త్ తెలుపుతుంది..
ఈ షార్ట్ ఫిలిం కి తన కెమెరా పనితనం తో రిచ్, పోయిట్రిక్ లుక్ తీసుకోచాడు ఛాయాగ్రాహకుడు శివ శంకర వర ప్రసాద్..

ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగున్నాయి..


హైలైట్స్‌:

·         స్క్రీన్ ప్లే

·         డైలాగ్స్

·         ఛాయాగ్రహణం

·         దర్శకత్వం


డ్రాబ్యాక్స్‌:
    హీరోయిన్  పర్‌ఫార్మెన్స్‌ చాలా వీక్‌


విశ్లేషణ:

ఈ షార్ట్ ఫిలిం లో  డైలాగ్స్ మెయిన్ హైలేట్, ఈ చిత్ర  దర్శకుడు ప్రేమ, పెళ్లి గురించి చాలా రీసెర్చ్ చేసాడు అనిపిస్తుంది, ఇందులో హీరో క్యారెక్టర్ చెప్పే ప్రతి డైలాగ్ నిజమే.

“ప్రేమికులు హ్యాపీ గా ఉండాలి అంటే ప్రేమ ఉంటె చాలు, భార్య భర్తలు హ్యాపీ గా ఉండాలి అంటే డబ్బు ఉండాలి”

“ప్రేమ అంటే ఇద్దరు కలిసి ఉండటం, పెళ్లి అంటే అదే ఇద్దరినీ ఒక ఇంట్లో కట్టేసి ఉంచటం”

“ప్రేమ లో ఉన్నపుడు మాట్లాడితే టైం తెలియదు, పెళ్లి అయ్యాక మాట్లాడటానికి టైం ఉండదు”

"దేవుడు ఆడవాళ్ళకి ప్రేమ ని మరిచిపోయే వరాన్ని ఇచ్చాడు, కానీ అదే దేవుడు మగవాళ్ళకి ప్రేమ ను జీవితాంతం గుర్తుంచుకొనే శాపాన్ని ఇచ్చాడు"...

"అమ్మాయిలు ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటారు, కాని కన్నీళ్లను కంట్రోల్ చేసుకోలేరు.. అబ్బాయిలు కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటారు, కానీ ఫీలింగ్స్ ఎప్పటికి కంట్రోల్ చేసుకోలేరు"

"మనకి దగ్గర అయిన వాళ్ళు కనిపిచినపుడు స్మైల్, దూరం అయిన వాళ్ళు కనిపిచినపుడు సైలెన్స్ ఆటోమాటిక్ గా వస్తాయి"

"భార్యాభర్తల మద్య గొడవలు లేవు అంటే, రహస్యాలు ఉన్నాయి అని అర్థ

ఇలా ఇంక ఎన్నో సూపర్ డైలాగ్స్ రాసి తనలో అద్బుతమైన  రైటర్ ఉన్నాడు అని శ్రీకాంత్ వంగా నిరుపిచుకునాడు...

ప్రేమను ఆపేదెవరు షార్ట్ ఫిలిం ఒక అబ్బాయి, అమ్మాయి ని ఎంతగా లవ్ చేసాడో చెపుతుంది..

మరి ఎక్కువ డైలాగ్స్ అవ్వటం వల్ల ఈ షార్ట్ ఫిలిం కొంచెం బోర్ గా అనిపిస్తుంది..అలాే హీరోయిన్ నటన కూడా చాలా పేలవంగా ఉంది ...కానీ క్లైమాక్స్ చూసే సరికి ఒక అద్బుతమైన షార్ట్ ఫిలిం చుసిన ఫీలింగ్ కలుగుతుంది.. నిజం గా చిత్ర దర్శకుడి కి హట్స్ ఆఫ్...



బోటమ్‌ లైన్‌: ప్రేమను ఆపేది “పెళ్లి”












Post a Comment

 
Top