సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ రంగప్రవేశం గురించి మరోసారి ఊహాగానాలకు
తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తన రాజకీయ రంగప్రవేశం మీడియాలో
వార్తలు వచ్చినా ఎప్పుడు గట్టిగా స్పందించలేదు . ప్రతిసారి ఈ విషయాన్ని
దాటేసేవాడు. అయితే రెండు రోజుల క్రితం బెంగుళూరులో రజని తన రాజకీయ రంగప్రవేశం
గురించి మాట్లాడుతూ మీడియా ప్రతినిదులు అడిగిన ప్రశ్నకు అనేక అర్ధాలు వచ్చే విధంగా
స్పందించడం కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల్లోకి వస్తారా ? అంటూ మీడియా
ప్రతినిధి ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘దేవుడు
నడిపిస్తే ఆ వైపు తప్పకుండా నడుస్తాను’ అని స్పందించడం బట్టి
మరో రెండు ఏళ్ళల్లో తమిళనాడులో జరిగె అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రజనీకాంత్
అన్న మాటలు సంకేతంగా భావించాలని అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తుంది.
రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12 న విడుదల
అవుతున్న లింగా అనుకున్న విజయం సాధిస్తే రజని రాజకీయ రంగప్రవేశం ఖాయం అనుకోవాలి. ఇదే
జరిగితే తమిళనాడులో పెను మార్పులు జరగడం ఖాయం .
Post a Comment