GuidePedia

0


తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ ప్రాథమిక అంచనాల ప్రకారం 88 వేల కోట్ల రూపాయల వరకు చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రణాళికేతర వ్యయం 55 వేల కోట్ల రూపాయలు, ప్రణాళికా వ్యయం 33 వేల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చునని అంచనా. వీటితోపాటు.. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వాటిని, ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదించిన పథకాలన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుంటే.. వార్షిక ప్రణాళిక ఒక్కటే 55 వేల కోట్ల రూపాయల మార్కును దాటే పరిస్థితి కనిపిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. అదే జరిగితే మొత్తం బడ్జెట్‌ సైజు లక్ష కోట్ల రూపాయల మార్కును దాటిపో వడం ఖాయమని ఆ వర్గాలు వివరించాయి. పది నెలల కోసం ఇంత మొత్తాన్ని ప్రవేశపెట్టడం, ఎట్టి పరిస్థితుల్లో నూ సాధ్యం కాదని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ రాబడులు, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే గ్రాంట్లు, రుణాలు, ఇతర మార్గాల్లో ఆదాయ సేకరణ.. తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. మొత్తం ఆదాయం అంచనా 88 వేల కోట్ల రూపా యలకు చేరుతోందని, ఇది కూడా చాలా కష్టమైన లక్ష్యమేనని వివరించాయి. 2014-15 ఆర్థిక సంవ త్సరంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పన్నుల రూపేణా వచ్చిన 18 వేల కోట్ల రూపాయల ఆదాయమంతా ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలోకి వెళ్లిందని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అందులో తెలంగాణ వాటాగా దాదాపు 7500 కోట్ల రూపా యలు రావాల్సి ఉన్నా, ఆ మూడు నెలల ఖర్చు కూడా ఆంధ్రప్రదేశ్‌ ఖాతాలోకే వెళుతున్నందున.. ఆదాయం మొత్తం తమకే చెందాలని ఆ రాష్ట్రం వాది స్తోందని తెలిపాయి. ఇలాంటి వాటిపై స్పష్టత రాకుం డానే 2014-15లో పది నెలల కాలానికి బడ్జెట్‌ను తయారు చేయాల్సి వస్తోందని ఆ వర్గాలు పేర్కొ న్నాయి. మన ఊరు - మన ప్రణాళిక’, సీఎం హామీ లకు తోడు రైతుల రుణ మాఫీ వ్యవహారం కూడా బడ్జెట్‌ తయారీలో కీలక అంశంగా మారిందని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. ఆర్‌బీఐ పేర్కొన్న ప్రకా రం.. మొత్తం రుణ మాఫీలో కేవలం 1000 కోట్ల రూ పాయల వరకే రీ షెడ్యూల్‌కు అవకాశం కలుగుతున్నదని విశ్లేషిస్తున్నా యి. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.16337 కోట్ల భారాన్ని భరించాల్సి వచ్చే సూ చనలు కనిపిస్తున్నాయని తెలిపాయి. 2014-15 బడ్జెట్‌ లో రుణ మాఫీకి నిధులను కేటా యించాల్సి ఉందని, ఈ కేటాయింపులను ప్రణాళికేతర వ్యయ పద్దుల్లో చేర్చాలా లేక ప్రణాళికా వ్యయ పద్దుల్లో చేర్చాలా అన్న దానిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది.

Post a Comment

 
Top