సెంటిమెంట్స్ తో బలైన ఆగడు !!
విడుదలకు
ముందు ‘ఆగడు’ ఎంత హడావిడి చేసిందో
విడుదలై ఒక్కరోజు గడవకుండానే ‘ఆగడు’ పై వస్తున్న కామెంట్స్ ఆశ్చర్యకరంగా మారుతున్నాయి. మహేష్
బాబు అభిమానులు ‘ఆగడు’ రిజల్ట్ పై బయటకు
ఆనందం నటిస్తున్నా లోలోపల ఈ సినిమా కలెక్షన్స్ ఈ
వీకెండ్ తరువాత ఎంత వరకు నిలబడతాయి అనే మధనంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాము ఎన్నో ఆసలు పెట్టుకున్న ‘ఆగడు’ ను ముందుగా
ఊహించినట్లే తమన్నా, రాజేంద్ర ప్రసాద్ సెంటిమెంట్లు
దెబ్బతీశాయని మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు.
రాజేంద్రప్రసాద్ తండ్రి పాత్రలతో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఒక్క ‘జులాయి’ మినహా అన్నీ డిజాస్టర్లే. అదేవిధంగా తమన్నాకు ‘హ్యాపీ డేస్’, ‘100%లవ్’
మినహా అన్నీ ఫ్లాప్ లే. దీనికి తోడు మహేష్ తో రెండవ సినిమా చేసి ఫ్లాప్ ల రికార్డు
మూటకట్టుకున్న గుణశేఖర్, త్రివిక్రమ్ ల సెంటిమెంట్ లిస్టులో శ్రీనువైట్ల కూడ
చేరిపోయి తమ అభిమాన హీరో మహేష్ బాబుకు అన్యాయం
చేసాడని మహేష్ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికి తోడు శ్రీనువైట్ల భార్య ‘ఆగడు’ సినిమాకు
కాస్ట్యూమ్స్ ఎడ్వైజర్ గా మహేష్ డ్రెస్
స్టయిలింగ్ పై చేసిన ప్రయోగాలు మహేష్ అభిమానులకు తీవ్ర నిరాశను కలిగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా
ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న మహేష్ బాబు సినిమాను
నిన్న ప్రత్యేక షోలో చుసిన సూపర్ స్టార్ కృష్ణ ‘ఆగడు’ ను 100
కోట్ల సినిమాగా అభివర్ణించడం జోక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
Post a Comment