GuidePedia

0

ఆ హీరో పై డైరెక్టర్ ఫైర్ !!

హీరో శివాజీకి రాక రాక తాజాగా ఓ మాదిరి హిట్టొచ్చింది. అతను హీరోగా నటించిన 'బూచమ్మ బూచోడు' సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. దాంతో గత రెండు మూడు రోజులుగా శివాజీ మన టీవీ చానెల్స్ లో సినిమా గురించి ఊదరగొట్టేస్తున్నాడు. తనొక్కడే టీవీ చానెల్స్ లో కూర్చుని సినిమా గురించి ఇలా చెప్పేస్తుంటే ఆ సినిమా దర్శకుడు రేవన్ యాదు చాలా అప్సెట్ అయిపోతున్నాడు."నేనెంతో కష్టపడి కథను తయారుచేసుకుని, దీనిని తెరకెక్కించాను. కోటి రూపాయల్లో తీయాల్సిందానిని నలభై లక్షల్లో తీశాను. ఆర్టిస్టులని కూడా తక్కువకి మాట్లాడాను. ఇప్పుడు సినిమా హిట్టవడంతో, ప్రమోషన్ విషయంలో శివాజీ నన్ను పక్కన పెడుతున్నాడు. ఈ హిట్ క్రెడిట్ ను తన ఖాతాలో వేసేసుకుంటున్నాడు. ఇది నా సృజన... నా కష్టం" అంటూ ఈ దర్శకుడు టీవీలకి ఎక్కాడు. మరి, శివాజీ ఏమంటాడో!

Post a Comment

 
Top