GuidePedia

0

సిసి రెడ్డి కన్నుమూత 

రాష్ర్ట ప్రభుత్వ మాజీ సలహాదారు, సినీ నిర్మాత సీసీ రెడ్డి సోమవారం సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన సీసీ రెడ్డి ఆ తర్వాతి కాలంలో అమెరికా వెళ్లారు. అమెరికాలో షేరెక్స్ ఇంటర్నేషనల్, జెస్టర్ ఇంపోర్ట్స్, ట్రిల్టెక్స్ వంటి ప్రముఖ సంస్థలకు సీఈఓ హోదాలో పనిచేశారు. అనంతరం విసు కన్సల్టెన్సీ పేరిట ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి విదేశాలకు వ్యాపారాన్ని విస్తరించారు. ఈయన వ్యాపరవేత్తగానే కాక సినీ నిర్మాతగా కూడా 'రూమ్ మేట్స్, మీ శ్రేయోభిలాషి, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాలకు కూడా ఆయన నిర్మాణ సారథ్యం వహించారు. పునర్‌విభజనకు ముందు రాష్ర్ట ప్రభుత్వ మాజీ సలహాదారుగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఇవే కాకుండా 'ఈభూమి' పేరిట ఓ మంత్లీ మేగజైన్‌ని కూడా స్థాపించారు. 

Post a Comment

 
Top