GuidePedia

0

నిర్మాతగా మారుతున్నా సమంత

కొంతకాలంగా కథానాయికలు నిర్మాతలుగా మారేందుకు ఆసక్తిని చూపుతున్నారు. తమ మనసుకు నచ్చిన కథలతో సినిమాల్ని నిర్మించేందుకు ముందుకొస్తున్నారు.ఇప్పటికే ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే, లారా దత్తా, అమీషాపటేల్, రేణుదేశాయ్, శిల్పాశెట్టి ...లాంటి అనేక మంది కథానాయికలు నిర్మాతలుగా కొత్త బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా వారి బాటలోనే అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నది చెన్నై చిన్నది సమంతా. తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా చెలామణి అవుతున్న ఈ సుందరి త్వరలోనే నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిసింది.
 
ఇటీవలే సమంతాకు ఓ నూతన దర్శకుడు కథను వినిపించినట్లు, కథలోని కొత్తదనం నచ్చడంతో ఈ చిత్రాన్ని తానే స్వయంగా నిర్మించాలనే ఆలోచనకు ఆమె వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్రానికయ్యే నిర్మాణ వ్యయం, షూటింగ్‌కు పట్టే సమయాన్ని గురించి దర్శకుడితో చర్చలను జరుపుతున్నట్లు తెలిసింది. చిత్రంలో సమంతా నటించడం లేదని కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరలో సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో విజయ్ సరసన కత్తి చిత్రంలో కథానాయికగా నటిస్తోంది సమంతా.

Post a Comment

 
Top