GuidePedia

0

బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లిస్టులో రభస

ఎన్టీఆర్ కి ఎదురుదెబ్బ తగిలింది. రభస సినిమా యావరేజ్ గా ఉన్న కానీ , బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలకి దీటుగానిలిచింది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా పదికోట్లకు పైగా రాబట్టిన ఈ సినిమా ఆ తర్వాత దారుణంగా పడిపోయింది. సోమవారం వరకు అయినా స్ట్రాంగ్ గా ఉంటుందని అనుకుంటే…. రెండో రోజే పతనం మొదలైనది. ఈవారం పెద్ద సినిమాలు ఏవి లేకపోవడంతో రభసకి లాభం ఉంటుందని అనుకున్నారు.కానీ పెద్ద సినిమాలు లేకపోయినా రభస థియేటర్స్ తగ్గించేశారు. రెండో వారం లో ఎక్కువ థియేటర్స్ ఉండడం వలన షేర్ లాస్ అవడం తప్ప లాభం ఉండదని బయ్యర్లు తేల్చేశారు. కనీసం మరో వీకెండ్ అయిన ఈ సినిమాకి చాన్స్ ఇవ్వలేదు. ముప్పై కోట్ల షేర్ అయినా సాదిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాతో భయర్లు తీవ్రంగా నష్టం తప్పెట్లు లేదు. రామయ్య వస్తావయ్యా కంటే తక్కువే వసూలు చేస్తుందని అంటున్నారంటే ఎన్టీఆర్ కి ఇది మరో భారీ డిజాస్టర్ కింద జమ అవుతుంది.

Post a Comment

 
Top