మెగా హీరో పై రవితేజ నోటిదురద !!
మొన్న ఆదివారం జరిగిన పవర్ ఆడియో వేడుకలో రవితేజ
మాట్లాడిన మాటలు మెగా హీరోని టార్గెట్ చేస్తున్నట్లుగా ఉన్నదని ఫిల్మ్ నగర్
వర్గాలు అంటున్నాయి. రవితేజ పవర్ సినిమాలో తనతో నటించిన హీరోయిన్ రేజీనా గురించి
మాట్లాడుతూ రెజినా నటించిన కొత్తజంట సినిమాలో ఆ
హీరోకంటే రేజినాకు ఎక్కువ పేరు వచ్చిందని రవితేజ ప్రశంసించాడు.
అయితే ఈ మాటలను విశ్లేషకులు మరో అర్ధం తీస్తూ రవితేజ
ఈమధ్య విడుదలయిన కొత్త జంట సినిమాని దృష్టిలో పెట్టుకొని రవితేజ ఈ కామెంట్స్
చేశాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రెజినాని పొగడటం వరకు ఈ వ్యాఖ్యలు బాగున్నా
యంగ్ హీరోలని టార్గెట్ చేస్తూ రవితేజ ఇలా ఎందుకు మాట్లాడాడు అనే చర్చలు కూడా
మొదలయ్యాయి.ముఖ్యంగా మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్న రవితేజ అల్లు శిరీష్
కొత్త జంట సినిమాని టార్గెట్ చేస్తూ ఈ మాటలు అన్నాడా లేదా రేజినాని పొగిడే
ఉద్దేశ్యంతోనే ఇలా అన్నాడా అనే విషయంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది
ఏమైనా రెజినాని పొగిడిన పొగడ్తలు రవితేజకు సమస్యగా మారాయని అనుకోవాలి.
Post a Comment