GuidePedia



చేకోడి రేటింగ్  :  2.5/5
చిత్రం  : 
బ్యానర్  : ఆస్కార్ ఫిల్మ్ ప్ర.లి
సంగీతం  : ఏ ఆర్ రెహమాన్
ఛాయాగ్రహణం  : పి సి శ్రీరామ్  
నిర్మాత  : ఆస్కార్ రవిచంద్రన్
రచన,దర్శకుడు  : శంకర్  
నటినటులు  : విక్రమ్, అమీ జాక్సన్, సురేష్ గోపి, ఉపేన్ పటేల్, సంతానం  తదితరులు

దర్శకుడు శంకర్‌ సినిమా వచ్చిందంటే అందులో ఏదో ప్రత్యేకత వుంటుందని ప్రేక్షకులు కచ్చితంగా ఊహిస్తారు. అయితే మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు రకరకాల ప్రయోగాలు చేసిన శంకర్‌.. రెండేళ్ళపాటు నటుడు విక్రమ్‌ను భౌతికపరంగా చాలా మార్పులకు గురిచేసి ‘ఐ’ సినిమాని రూపొందించాడు. అమీ జాక్సన్ హీరోయిన్ గా పని చేసినా ఈ సినిమాకి పిసి శ్రీరామ్ మొదటి సరి శంకర్ సినిమాకి పనిచెయ్యడం ఆసక్తికి గురి చేసింది మరి ఆ ఆసక్తి ఎలా వుందో చూద్దాం.

కథ :  సనత్ నగర్ లింగేశ్వర్‌ (విక్రమ్‌)కు మిస్టర్‌ ఆంధ్ర నుంచి మిస్టర్‌ ఇండియాకు ఎదగాలనేది  కోరిక. బాడీని బాగా పెంచి మిస్టర్‌ ఆంధ్ర పోటీకి వెళుతుండగా ఓ పోటీదారు అవమానించి తప్పుకోమంటాడు. ఆ తర్వాత జరిగిన గొడవతో లింగేశ్వర్‌పై పగ పెంచుకుంటాడు. లింగేశ్వర్‌ మిస్టర్‌ ఆంధ్రాగా ఎంపికవుతాడు. ఇక్కడ ఓ లోకల్‌ ప్రొడక్ట్‌ కు మోడల్‌గా వుంటాడు. మరోవైపు జాతీయస్థాయిలో అందమైన మోడల్‌గా వుండే దియాకు ప్రముఖ మోడల్‌ జాన్‌కు మధ్య ఏర్పడిన గొడవతో ఆమె లింగేశ్వర్‌ను లీ గా మార్చేసి మోడ్రన్‌ మోడల్‌గా తయారుచేస్తుంది. దియా అంటే వల్లమాలిన ప్రేమ. కాగా, మొట్టమొదటిసారిగా చైనాలో మోడలింగ్‌కు తీసుకెళుతుంది. అక్కడ నటనలో ఎమోషన్స్‌ పండించడం కోసం ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతుంది. దాంతో బాగా నటించి ప్రొడక్ట్‌కు క్రేజ్‌ తెస్తాడు. పాపులారిటీ పెరిగిపోతుంది. ఇది సహించని జాన్‌.. లీపై చైనాలో ఎటాక్‌ ఇస్తాడు. దాన్నుంచి ఎలాగో తప్పించుకుంటాడు. ఆ తర్వాత దియా.. లీకు మరింత దగ్గరై నిజంగానే ప్రేమిస్తుంది. ఇద్దరూ జీవితాంతం తామూహించినట్లుగా అందమైన తోట, మధ్యలో ఇల్లులో వుండాలని ప్లాన్‌ చేస్తారు. కానీ అవి కలగానే వుండిపోతాయి. దానికి కారణం లీ కురూపిగా మారిపోవడమే. దీనికి కారణం ఎవరు? ఎందుకని అలా చేశారు? చివరికి ఏమయింది? అనేది మిగిలిన కథ.

నటినటులు : విక్రమ్ నటనాపరంగా చియాన్‌ విక్రమ్‌ను అభినందించాల్సిందే. మాస్‌ పాత్ర నుంచి మోడ్రన్‌ వరకు, కురూపిలో మూడు రకాల పాత్రలకు జీవం పోశాడు. ముఖ్యంగా కురూపిగా విక్రమ్ మంచి హావభావాలను పలికించాడు. అలాగే పగ తీర్చుకునే సందర్భంతో మంచి నటననే కనపరిచాడు.
 
దియాగా అమీజాక్సన్‌ మోడల్‌గా బాగానే చేసింది. ఆమె నటించడానికి పెద్దగా లేకపోయినా చిన్నపాటి ఎమోషన్స్‌ పండించింది. సురేష్ గోపి, ఉపన్ పటేల్, సంతానం తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. మేకప్‌మేన్‌ గే పాత్ర బాగా చేశాడు. 

సాంకేతిక వర్గం : సాంకేతిక పరంగా ఈ సినిమాకి కెమెరాతోపాటు, విజువల్‌గా గ్రాఫిక్స్‌, డిఎ. ఎఫెక్ట్స్‌ ప్రత్యేక ఆకర్షణ. ఇవన్నీ పాటలకు కొన్ని సన్నివేశాలకు ఉపయోగించారు. అయితే కురూపిగా రకరకాలుగా మార్చడానికి మేకప్‌మేన్‌ పాత్ర కీలకం. పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. ముఖ్యంగా చైనా లోకేషన్స్ ను చిత్రీకరించే సందర్భం ఎక్స్ ట్రార్డినరీ గా అనిపిస్తుంది. ఇక ఎఆర్‌ రెహమాన్‌ బాణీలంటే తెలిసిందే. మెలోడీ తరహాలో సాగే పాటలకు చక్కగా అల్లుతాడు. ముఖ్యంగా 'పరేశానయ్యా..' ‘నువ్వుంటే నా..’ అనే పాటలకి ట్యూన్‌ బాగుంది. మిగిలిన ట్యూన్‌ బాగున్నా పాటల్లో సాహిత్యం అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే, ఎడిటింగ్ అసలు బాలేదు. సినిమా లెంగ్త్ చాలా ఎక్కువైపోయింది. ఏ సినిమాకైనా ప్రధాన బలం అయిన కథ కథనం దర్శకత్వం విభాగాలకు వస్తే.. ఈ మూడింటిని డైరెక్టర్ శంకర్ డీల్ చేసాడు.  పాతకాలం నుంచి వస్తున్న రొటీన్ లవ్ స్టొరీని తీసుకొని దానికి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, గ్రాండ్ విజువల్స్ జతచేసి కథని రాసుకున్నాడు. కావున ఎప్పటిలా శంకర్ కథలో ఉండే కొత్తదనం ఇందులో ఉండదు. ఓవరాల్ గా బోరింగ్ అండ్ ఊహాజనితంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఈ సినిమా పరంగా ఓ దర్శకుడిగా శంకర్ టాప్ పొజిషన్ లో ఉంటాడు కానీ ఆడియన్స్ ని మెప్పించడంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు.  ఇప్పట్లో మూడు గంటల పాటు ప్రేక్షకుడిని హల్లో కూర్చోపెట్టడం కష్టం. సినిమా లెంగ్త్ ని మరింత తగ్గించి ఉంటే బావుండేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

  • ·        విక్రమ్
  • ·        పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ  
  • ·        సంగీతం


డ్రా బాక్స్ :

  • ·        కథనం
  • ·        లెంగ్త్ మరి ఎక్కువ కావడం
  • ·        ఎడిటింగ్


విశ్లేషణ :  సాధారణ పాయింట్‌ను హైటెక్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే ఈ చిత్రంలోని ప్రత్యేకత. సమాజంలో ఎన్నో సమస్యలు అవినీతి, లంచగొండితనం వంటివి ఎన్నో అంశాలు టచ్‌ చేసిన శంకర్‌. ఈసారి.. మోడల్‌ రంగంలో ఒక మంచి సామాన్యుడు పోటీ వస్తే ఎలాంటి ఈర్ష్యద్వేషాలు కట్టలు తెంచుకుంటాయో అనేది చూపించాడు. అందుకు డాక్టర్‌ పాత్ర తోడయింది. ఫ్యామిలీ డాక్టర్‌ ఆ ఇంటి అమ్మాయిపై కన్నేసి... మరొకడికి దొరక్కుండా చేయడంలో సురేష్‌గోపీ పాత్ర.. ఇది సొసైటి కల్చర్‌కు తార్కారణం. అసలు విలన్‌ డాక్టర్‌ అనేది చివరి వరకు తెలీకుండా జాగ్రత్తపడ్డాడు దర్శకుడు.  అయితే ఇందులో 'ఐ ఇన్‌ప్లూయన్స్‌ పెరసీ' అనే జనటిక్‌ ఇంక్షన్‌.. పేరుగా టైటిల్‌కు పెట్టడం జరిగింది. అందమైన వాడిని డైరెక్ట్‌ గా చంపకుండా కురూపిగా మార్చి జీవశ్చవంలా చేయడమే దీని పని. లోకం.. అంతే. ఒకరు బాగుంటే చూడలేరు. అనేది ఓ డైలాగ్‌లో చెబుతాడు విక్రమ్‌. ఈ చిత్రానికి అదే పాయింట్‌. ఈ పాయింట్‌తో రకరకాల కథలు అల్లుకోవచ్చు చాల చిత్రాలు వచ్చాయి కూడా. అయితే భారీ అంచనాలను అందుకునే స్థాయిలో లేని కథ, కథనం ఈ సినిమాకి మైనస్. ఎలాంటి అంచనాలు లేకుండా ఓ రెగ్యులర్ ఓ కమర్షియల్ మూవీ చూడాలనుకునే వారు ఈ సినిమాని ఓ సారి ట్రై చెయ్యచ్చు.
 
Top