GuidePedia

 రహస్యంగా..నిర్మాత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన రాణి ముఖర్జీ

ధూమ్-3 చిత్ర నిర్మాత, యశ్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా....హీరోయిన్ రాణీ ముఖర్జీ మధ్య ఎఫైర్ ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొంత కాలంగా బాలీవుడ్లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈ విషయం అధికారికంగా ఖరారైంది. ఈ మేకు యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ నుండి ప్రకటన వెలవడింది. నిన్న రాత్రి (ఏప్రిల్ 21) ఆదిత్య చోప్రా, రాణి ముఖర్జీ వివాహం జరిగినట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కేవలం కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సంక్షంలో సింపుల్‌గా ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలిపారు.
గత సంవత్సరం జులై నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణి ముఖర్జీ చేతికి ఖరీదైన డైమండ్ రింగ్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలమయ్యాయి. అయితే పెళ్లి జరిగే వరకు ఈ విషయాన్ని వాస్త గోప్యంగానే ఉంచుతూ వచ్చారు. వాస్తవానికి వీరి పెళ్లి ఇప్పటికే జరుగాల్సి ఉండగా....యశ్ చోప్రా మరణంతో వాయిదా పడిందని అంటున్నారు
 
Top