GuidePedia

Mythri Moviemakers to produce Mahesh - Koratala Shiva film

మహేష్ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియం లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.
మహేష్ బాబు మాట్లాడుతూ :
కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ :
దర్శకుడిగా నా రెండో చిత్రమే మహేష్ బాబులాంటి క్రేజీ హీరోతో చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది అన్నారు.
నిర్మాలు మాట్లాడుతూ :
" మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ఉంటుంది అన్నారు.

మైత్రి మూవీస్ ఏకర్స్ తొలి చిత్రంగా నిర్మాణం అవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. 
 
Top