GuidePedia



రివ్యూ : రేసుగుర్రం 
విభాగం : కామెడీ/ఆక్షన్/ఫ్యామిలీ
చేకోడి రేటింగ్ : 3/5
బ్యానర్ :శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్
సంగీతం : ఎస్ ఎస్ తమన్ 
ఎడిటింగ్ : గౌతం రాజు 
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
కథ : వక్కంతం వంశీ 
నిర్మాతలు : నల్లమలపు శ్రీనివాస్ ( బిజ్జి ) , డా. వెంకటేశ్వరరావు.
దర్శకత్వం : సురేందర్ రెడ్డి 
సినిమా నిడివి : 175 నిముషాలు 
విడుదల : 11-04-2014
నటీనటులు : అల్లు అర్జున్, శృతి హసన్, కిక్ శామ్, సలోని అశ్విని,  ప్రకాష్ రాజ్, సుహాసిని మణిరత్నం, రవికిషన్, బ్రహ్మానందం, అలీ తదితరులు..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరమ్మయిలతో ఫ్లోప్ తర్వాత చాలా గ్యాప్ తో ఈ వారం మన ముందుకు వచ్చాడు. అల్లు అర్జున్ సరసన తొలిసారి శృతి హసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. తొలిసినిమా ‘అతనొక్కడే’తో యాక్షన్ డైరెక్టర్ అనిపించుకున్న  సురేందర్‌రెడ్డి.. మహేష్‌బాబు అతిధి, ఎన్.టి.ఆర్. అశోక్ షాక్స్‌తో ‘కిక్’ నుండి ఎంటర్ టైన్మెంట్ మిక్స్ చేసి స్టైలిష్ డైరెక్టర్‌గా టర్న్ తీసుకున్నాడు. డిఫెరెంట్ స్టైలిష్ మేకర్ గా పేరు పొందిన సురేందర్ రెడ్డి దర్శకత్వoలో రూపొందిన రేసుగుర్రం సినిమా ఎలా ఉందొ మా చేకోడి రివ్యూ లో చూద్దాం...

కథ :

  కథ: అమెరికా వెళ్ళాలనే ఆశతో లైఫ్‌ని జాలీగా గడిపే లక్కి ( అల్లు అర్జున్ ), ఏసీపీ రామ్ ( కిక్ శ్యామ్ ) అన్నదమ్ములు. చిన్నప్పటినుండీ ఇద్దరికీ గొడవలే. ఒకరితోఒకరు గిల్లికజ్జాలు పెట్టుకుంటూ కొట్టుకుంటూ పెరుగుతారు. గూండా శివారెడ్డి ( రవి కిషన్ ) రాజకీయ నాయకుడిగా మారే క్రమంలో రామ్ అడ్డుతగుల్తాడు. రామ్‌ను శివారెడ్డి చంపే ప్రయత్నంలో లక్కీ అనుకోకుండా అడ్డుపడతాడు. శివారెడ్డి మంత్రి అయ్యాక అన్నదమ్ములిద్దరిపై పగ తీర్చుకున్నాడా..? రామ్‌ను ఫ్యామిలీని రక్షించుకోవడానికి కిల్‌బిల్ (బ్రహ్మానందం) మంత్రి గోవర్ధన్ (పోసాని) ఎలా ఉపయోగపడ్డారనేదే ‘రేసుగుర్రం’ మూవీ. 


నటీనటుల పనితీరు :

రేసు గుర్రం సినిమాకి అల్లు అర్జున్ హీరో అవ్వడం మొదటి ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాసుకున్న కథకి అతని వందకి వంద శాతం న్యాయం చేసాడు. ఈ సినిమాలో అతను చూపించిన మానరిజం, డైలాగ్ డెలివరీ ఇంతకముందు సినిమాల్లో చేయలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్ని వాడే ‘దేవుడా…’. అనే ఊతపదం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. అలాగే బన్ని నుంచి అభిమానులు ఆశించే డాన్సులు అన్ని పాటల్లోనూ వేయకపోయినా ‘సినిమా చూపిస్తా మామ’, ‘డౌన్ డౌన్ డుప్ప’ పాటల్లో మాత్రం స్టెప్స్ బాగా వేసాడు.

యంగ్ విలన్ శివారెడ్డి‌గా భోజ్‌పురి హీరో రవి‌కిషన్ అంతగా సెట్ కాలేదు. డబ్బింగ్‌లో గ్రేస్ ఉన్నా క్లాష్ కుదరలేదు. చెట్టుకు వేలాడించి మరీ హీరో - విలన్స్‌తో డైలాగ్స్ చెప్పించడం ఓవర్ అనిపించినా ముఖేష్ రుషి సీన్స్ బావున్నాయి. ఎంత లక్కీ హీరోయిన్ అయినా శృతి‌హాసన్ మరీ జీరో సైజ్‌లో గ్లామర్ మిస్ అవుతోంది. ఎంట్రీ లిఫ్ట్ సీన్‌లో బార్బీ డాల్ లా కనిపించింది. గలగల సాంగ్‌లో శారీలుక్ లో ఎంతందంగా ఉందో మిగతా మూవీ అంతా శృతిని బన్నీ డామినేట్ చేశాడు డ్యాన్సుల్లో మాత్రం బన్నీతో పోటీ పడింది. తనికెళ్ళ భరణి, జె.పి, పరుచూరి వెంకటేశ్వరరావు, కోటశ్రీనివాసరావు,ఎం.ఎస్.నారాయణ, రాజీవ్ కనకాల , రఘుబాబు , కారుమంచి రఘు , పవిత్ర , ప్రగతి రోల్స్ నామమాత్రమే అయ్యాయి. సలోనీ కొంత గ్యాప్‌తో తళుక్కుమంది. సెకండాఫ్‌లో డాక్టర్ బాలిగా ఆలీ రోల్ కిక్ కంటిన్యుటీ అన్నట్టుగా కాసేపు నవ్వించాడు. కిల్ బిల్ పాండే గా బ్రహ్మానందం రేసు గుర్రానికి ట్రంప్ కార్డ్ జాకీ‌గా నిల్చాడు. దూకుడు, బాద్ షా ఇమిటేషన్ ఉన్నా, సీన్స్‌లో అతి ఉన్నా నవ్వించాడు


సాంకేతిక వర్గం పనితీరు : 


టెక్నికల్ గా మనోజ్ ఫోటోగ్రఫీ బావుంది. తమన్ ట్యూన్స్ లో సినిమా సాంగ్ తప్ప ఏం గుర్తుండవు. పిక్చరైజేషన్ లో కలర్‌ఫుల్‌గా ఉన్నాయ్. సాంగ్స్ ప్లేస్ మెంట్ దాదాపు అన్నీ మైనస్ అయ్యాయి. వేమారెడ్డి డైలాగ్స్‌లో. బాడీలోనే స్పందన లేదు, అగ్గిపుల్లకి అగ్గి లేదు , నీలాంటి అన్న ఉంటే అన్నమయ్య అయినా పగబడతాడు, జీడిపప్పు ఉప్మా లాంటి పంచెస్ బానే పేలాయ్ పోసాని మేక్ ఎ విష్ - రాజా ఐలవ్‌యూ, బన్నీ- దేవుడా, ప్రకాష్‌రాజ్ - ఎమోషన్ కంట్రోల్ మేనరిజమ్స్ కొత్తగా ఉన్నాయి. గౌతంరాజు ఎడిటింగ్‌కు  ఫస్టాఫ్‌లో కొంత మిగిలింది. రామ్‌లక్ష్మణ్ ఫైట్స్ బావున్నాయి కానీ బన్నీ రేంజ్‌ని మించాయేమో అనిపిస్తాయి. రెగ్యులర్‌గా సురేందర్‌కు వక్కంతం వంశీ పాత కథలు అందిస్తున్నా స్క్రీన్ ప్లే తోనే బండి నడిపించాల్సివస్తోంది. కామెడీ కుదిరితే సేఫ్ లేదా ఊసరవెల్లి, కిక్  రిపీట్ అవుతున్నాయి.
 
ప్లస్ పాయింట్స్ :

  అల్లు అర్జున్
  బ్రహ్మానందం
  సినిమాటోగ్రఫీ
  కామెడీ
  క్లైమాక్స్ 30 నిముషాలు

మైనస్ పాయింట్స్ :

  లెంగ్త్ చాల ఎక్కువ
  ఒక్క పాట కూడా సందర్భానుసారంగా లేకపోవడం
  విలన్

హీరో సునీల్ వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయ్యే ఈ మూవీ సునీల్ - నాగచైతన్య హీరోలుగా వచ్చిన ‘తడాఖా’ చిత్రం పోలికలున్నాయి. అల్లు‌అర్జున్‌ను యాక్షన్ హీరోగా ఎలివేట్ చేస్తూ కిక్ కామెడీ ఫ్లేవర్ మిక్స్ చేసిన రేసుగుర్రం నడక ( స్క్రీన్ ప్లే) అస్తవ్యస్తంగా సాగుతూ మూవీ చివరిగంటలో బ్రహ్మానందం ఎంట్రీతో రేస్ మొదలు పెట్టి సేఫ్ గుర్రం అనిపించుకుంది. ‘జులాయి’ మూవీ క్యారెక్టరైజేషన్‌కు సీక్వెల్‌లా ఉన్న బన్నీ రోల్  ‘దేవుడా’ అనే ఫన్నీ మేనరిజంతో కొంత కామెడీ పండించినా డ్యాన్సులు, స్టైలింగ్ , యాక్షన్ లకే ఇంపార్టెన్స్ ఇస్తూ కథనం గాడితప్పింది. విలన్ రివెంజ్ ఓ లెవల్‌కు చేరాక ‘రేసుగుర్రం’ పరుగు నత్తనడకలా ఉన్న టైంలో బ్రహ్మానందం ఎంట్రీతో స్పీడ్  పెంచింది. చివరి గంటే రేసుగుర్రం సక్సెస్ రేంజ్ ను మార్చిందని చెప్పాలి. అల్లుఅర్జున్ ఈ మూవీలో ఎనర్జీ లెవల్స్ పెంచాడు. యాంగ్రీ యంగ్ మ్యాన్ టచ్ ఉన్నా ఎంటర్తైన్మెంట్ కూడా అందించాడు. బూచాడే , వెల్ కం టు పార్టీ,  సినిమా సూపిత్తా మావా సాంగ్స్ లో స్టెప్స్ అదరగొట్టాడు, స్టైలిష్ స్టార్ అనిపించాడు. సినిమాను ఎడిటింగ్ వింగ్‌లో చూసుకొని బ్రహ్మానందం ఎపిసోడ్ రీషూట్ చేసినట్టుగా ఉన్నా అడ్వాంటేజ్ అయింది. లేకుంటే శ్యామ్, రవి కిషన్, శృతి హసన్ క్యారెక్టర్స్‌లో దమ్ము లేనపుడు హీరోయిజం, కామెడీనే బెటర్ అని సురేందర్‌రెడ్డి ఫన్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్టుంది. ప్రకాష్ రాజ్ , ముఖేష్ రుషి , సాయాజీ షిండే లాంటి టాప్ ఆర్టిస్ట్స్ ఉన్నా ఒకట్రెండు సీన్స్ తో సరిపెట్టి బ్రహ్మానందాన్నే నమ్ముకున్నాడు. ఫైనల్‌గా రేసుగుర్రాన్ని  బన్నీ, బ్రమ్మి రైట్ జాకీలుగా ఎంటర్ టైన్మెంట్‌తో సేఫ్ రైడ్ అనిపించారు.

రివ్యూ : చే"కోడి"  

 
Top