చేకోడి రేటింగ్ : ★★½ - 2.5
నటీనటులు: బెల్లంకొండ
శ్రీనివాస్, సమంత, ప్రకాష్‌రాజ్, తనికెళ్ల భరణి, రఘుబాబు,
వెన్నెల
కిశోర్, ప్రదీప్ రావత్ తదితరులు
మాటలు: కోన వెంకట్
రచన: గోపిమోహన్
కథ: కె.ఎస్.రవీంద్రనాధ్
ఫైట్స్:
రామ్-లక్ష్మణ్, స్టన్ శివ, రవివర్మ, వెంకట్
పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల
ఎడిటింగ్: గౌతమ్‌రాజు,
సంగీతం: దేవిశ్రీ
ప్రసాద్,
కెమెరా: ఛోటా
కె.నాయుడు,
నిర్మాతలు: బెల్లంకొండ
గణేష్‌బాబు, బెల్లకొండ సురేష్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్. విడుదల తేదీ: 25, జూలై 2014
టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన
చిత్రాలను అందించిన బెల్లంకొండ సురేశ్ తన కుమారుడు శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అల్లుడు శీను. పగ, ప్రతీకారం, కామెడీ, నేపథ్యంగా ప్రేమకథా
చిత్రంగా రూపొందిన అల్లుడు శ్రీను చిత్రం
వీవీవినాయక్ దర్శకత్వంలో రూపొందింది. అల్లుడు
శ్రీనుగా శ్రీనివాస్ అకట్టుకున్నాడా అని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం.
కథ : నల్గొండలో ఉండే అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో
కథ : నల్గొండలో ఉండే అల్లుడు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) తన మామ నరసింహా (ప్రకాష్ రాజ్)తో
కలిసి
అప్పులు పాలై ,
పారిపోయి హైదరాబాద్ సిటీకి వచ్చేస్తాడు.
అక్కడ శ్రీనుకి తన మామ పోలికలతోనే...సెటిల్ మెంట్స్ చేస్తూ బ్రతికే
లోకల్ డాన్ భాయ్(ఇంకో ప్రకాష్ రాజ్) కనిపిస్తాడు. ఇది గమనించిన అల్లుడు శ్రీను...దాన్ని అడ్వాంటేజి గా తీసుకుని... ఓ
ట్రిక్ ప్లే చేస్తాడు. తన మామ గెటప్ మార్చి..భాయ్ గా తయారు చేసి, అతన్ని అడ్డం
పెట్టి దందా చేస్తూ డబ్బు సంపాదించటం మొదలెడతాడు. ఈ లోగా భాయ్
కూతురు అంజలి(సమంత) కూడా సినిమాటెక్ గా శ్రీను తో ప్రేమలో పడిపోతుంది.
ఇదిలా ఉంటే ...తన గెటప్ తో ఛీట్ చేస్తున్నారనే విషయం భాయ్ కి తెలిసిపోతుంది.
తన లాగే ఉన్న నరసింహాన్ని, శ్రీను ని చంపేయటానికి ప్రయత్నం
చేస్తాడు. అంతేకాకుండా తన కూతురుకు తన బిజినెస్
పార్టనర్(ప్రదీప్ రావత్)కొడుక్కి ఇచ్చి షార్జాలో వివాహం
చేయాలని నిర్ణయిస్తాడు. ఇది తెలుసుకున్న శ్రీను ఏం చేసాడు. భాయ్ కి ఎలా బుద్ది చెప్పాడు. అసలు భాయ్ కి, నరసింహా కు
ఉన్న సంభందం ఏంటి... అంజలిని ఎలా సొంతం చేసుకున్నాడు...డింపుల్ గా ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఏమిటి అనే విషయాలు తెలియాలంటే
చిత్రం చూడాల్సిందే.
నటినటులు :
అల్లుడు శ్రీనుగా బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ ను పోషించాడు. ఫైట్స్, డాన్స్ లతో తొలి చిత్రంలోనే ఆకట్టుకున్నాడు. కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కీలక సన్నివేశాల్లో నటనపరంగా కొంత తడబాటుకు గురైనట్టు కనిపించాడు. డైలాగ్ డెలివరిలో కొంత మెరుగుపరుకుంటే పూర్తి స్థాయి స్టార్ మారే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.
భాయ్ కూతురు అంజలిగా సమంత గ్లామరస్ గా కనిపించింది. మాస్ పాటల్లో సమంత మెరుగైన డాన్స్ ఆకట్టుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే సమంతకు రొటీన్ పాత్రే. తన పాత్రకు సమంత న్యాయం చేకూర్చింది. భాయ్, నర్సింహగా ప్రకాశ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే రెండు పాత్రల్లో పెద్దగా వైవిధ్యం కనిపించలేదు. ప్రకాశ్ రాజ్ ఇలాంటి పాత్రల్లో చాలా సార్లే ప్రేక్షకులకు కనిపించాడు. భాయ్, నర్సింహలో కొత్తదనం ఏమిలేదు.
డింపుల్ గా కనపడ్డ బ్రహ్మానందం ఈ చిత్రంలో అదరకొడతారని అంతా ఊహించారు. అదే రేంజిలో పబ్లిసిటీ సైతం చేసారు. అయితే సెకండాఫ్ లో హైలెట్ అని పబ్లిసిటీ చేసిన బ్రహ్మానందం... కామెడీ ఎక్కడా పేలలేదు.
ప్రదీప్ రావత్, రఘుబాబు, తనికెళ్ల భరణి ఇతర కారెక్టర్లకు అంతగా స్కోప్ లేకపోయింది.

ప్లస్ పాయింట్స్:
శ్రీనివాస్ యాక్టింగ్
ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
కామెడీ
శ్రీనివాస్ యాక్టింగ్
ప్రొడక్షన్ వేల్యూస్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
కామెడీ
సాంకేతిక వర్గం పనితీరు:
దేవిశ్రీ ప్రసాద్ మనస్సు
పెట్టి చేయని సినిమాల్లో ఇది ఒకటిగా మిగిలిపోతుంది. బ్యాక్
గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది. ఇక ఈ చిత్రాన్ని తెరపై చోటా కే నాయుడు అందంగా చిత్రీకరించాడు. అందమైన లోకేషన్లలో
చోటా కే నాయుడు కెమెరా పనితనం అదుర్స్ అనిపించింది. డైలాగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. కెఎస్ రవీంధ్ర (బాబి) అందించిన కథ చాలా పాతది. ఇక వివి
వినాయక్ - గోపి మోహన్ కలిసి రాసుకున్న
స్కీన్ ప్లే కూడా రెగ్యులర్ గానే ఉంది. స్క్రీన్ ప్లే మీద వీరు ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది.
చాల తెలుగు సినిమాలో వచ్చిన కథలు కలిపి వండినట్లున్న
ఈ చిత్రం కథ గురించి పెద్దగా మాట్లాడుకునేది ఏమీ లేదు.
ముఖ్యంగా సెకండాఫ్ ప్రారంభంలో ప్లాష్ బ్యాక్ పూర్తి కాగానే. విలన్ ని
డెన్ లో కట్టేయటంతోనే కథలో కాంప్లిక్ట్ అనేదే లేకుండా పోయి
బోర్ ప్రారంభమైంది. ఇలాంటి కమర్షియల్ సినిమాల్లో(విలన్, హీరో గేమ్
గల) విలన్ లేకుండా కథను ఎంత కామెడీగా నడిపినా పండదనే విషయం
ఎందుకనో మర్చిపోయారు. విలన్ ఏక్టివేట్ అయ్యే దాకా ఆ సీన్
లు అన్నీ వృధాగా మారిపోయాయి. విలన్ ఏక్టివేట్ అవ్వగానే దాదాపు సినిమా క్లైమాక్స్ కు వచ్చేసి, ఫైట్ తో
ముగింపుకు వచ్చేసింది. అలాగే కమర్షియల్ సినిమా కదా అనుకున్నారేమో లాజిక్ లు ఎక్కడా పట్టించుకోలేదు. కరెంట్ షాక్ లు ఇస్తూ మాటా పలుకు లేకుండా
పడిపోయిన విలన్ ప్రకాష్ రాజ్ ని లేపటానికి కరెంట్ షాక్ లు ఇస్తూ
లేపటానికి ప్రయత్నిస్తూంటే అది జరగదు. తర్వాత ఆ విలన్ కి
చెందిన వాళ్లు వచ్చి నీళ్లు కొట్టగానే లేచి కూర్చుంటాడు. అలాగే... హీరో
ఎక్కిన ప్లైట్ వెళ్లిపోతూంటే దాన్ని ఆపటానికి ఎయిర్ పోర్ట్
ఛీఫ్...అరుస్తూంటాడు..కానీ పైలెట్ కు ఒక ఫోన్ కొడదామని అనుకోడు.
ఇలాంటివి చాలా చిత్రంగా అనిపించే విచిత్రమైన లాజిక్కులు అనేకం ఈ సినిమాలోనే కనిపిస్తాయి. వినాయిక్ లాంటి పెద్ద దర్శకుడు ఆ
మాత్రం శ్రద్ద తీసుకోలేదా అనిపిస్తుంది.అన్ని కమర్షియల్ చిత్రలలానే ఈ
చిత్రంలోనూ మంచి పాయింట్ ఉంది కాని మంచి సన్నివేశాలు లేవు .. బయట పబ్లిసిటీ చూసి ఇదేదో గొప్ప మాస్ మసాలా చిత్రం
అనుకోని థియేటర్ కి వెళ్తే మోసపోతారు సమంత,తమన్నాల
వీరాభిమానులు కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా చూడాలి అనుకుంటేనే థియేటర్ కి వెళ్ళండి..
చేకోడి రేటింగ్ : ★★½ - 2.5
Post a Comment