GuidePedia

0



యు.ఎస్‌.లో సాప్ట్‌వేర్‌ రంగంలో వుంటూ సినిమా ప్యాషన్‌పై మధుర ఆడియో సంస్థను నెలకొల్పి.. దాన్నే ఇంటి పేరుగా మార్చుకున్న మధుర శ్రీధర్‌ తొలిసారిగా స్నేహగీతంఅనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. తనకు దర్శకత్వం చేయాలనే కోరిక ఎప్పటినుంచో వుందనీ, ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలను చూస్తుంటానని చెబుతున్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారాడు. నీలకంఠ దర్శకత్వంలో మాయచిత్రానికి నిర్మాత అయిన ఆయన మరో వైపు లేడీస్‌ అంట్‌ జెంటిమెన్‌అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. కాగా, ముందుగా మాయచిత్రం ఆగస్టు1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు.
నిర్మాతగా మారాలని ఎలా అనిపించింది?
నాకు దర్శకత్వమంటే చాలా ఇంట్రెస్ట్‌. అందుకోసమే ఇక్కడకు వచ్చాను. స్నేహగీతం మిశ్రమ స్పందన వచ్చింది. తర్వాతబ్యాక్‌బెంచ్‌ స్టూడెండ్‌చిత్రానికి దర్శకత్వం వహించాను. ఎందుకనో అనుకున్నంతగా రీచ్‌కాలేకపోయాను. దాంతో కంగారుపడి సినిమాలు చేయాలనే ఆలోచనకు ఫుల్‌స్టాప్‌ పెట్టాను. నాకు ఎక్కువగా హాలీవుడ్‌ దర్శకులు స్పీల్‌బర్గ్‌ ప్రభావం వుంది. ఆయన సినిమాలకు దర్శకత్వం వహిస్తూ మరోవైపు నిర్మాతగా కూడా తీస్తుంటారు. అలా చేయాలనే ఆలోచనే నిర్మాతగామ మారాను.
అతీంద్రియశక్తులపై చాలా సినిమాలు వచ్చాయికదా?
అవును. కానీ, నాకు నీలకంఠగారు ఇంగ్లీషులోఫైనల్‌ జస్టినేషన్‌రాకముందే అటువంటి కథ చెప్పారు. కానీ అప్పట్లో చేయడానికి టైమ్‌ కుదరలేదు. ఆ కథ చెప్పి దానికి దృశ్యంఅనే టైటిల్‌కూడా పెట్టారు. ఎందుకనే ఆ టైటిల్‌ నచ్చలేదంటే.. వెంటనే మాయగా మార్చి తీసుకువచ్చారు. ఇప్పుడు వెంకటేస్‌ చిత్రం దృశ్యంపేరు పెట్టాక.. చాలా థ్రిల్‌ ఫీలయ్యాను. అప్పుడు నేను కాదనుకున్న టైటిల్‌వచ్చిందే అనిపించింది.
అతీంద్రియశక్తుల కథలు సామాన్యులకు అర్థమవుతాయా?
తప్పకుండా. అన్నీ ఆలోచించినీలకంఠ కామన్‌మేన్‌కూడా అర్థమయ్యేలా చిత్రాన్ని తీశారు. మొన్ననే ఫస్ట్‌కాపీ డిస్ట్రిబ్యూటర్లకు చూపించాం. దర్శకుడు బోయపాటి శీను, ఎం.ఎస్‌.రాజు, విజయేంద్రప్రసాద్‌లుకూడా చూసి ఎంతగానో మెచ్చుకున్నారు. తెలుగు సినిమాలెవల్‌ను మరో మెట్టు ఎదిగేట్లు చేసిందన్నారు. సామాన్య ప్రేక్షకుడికి సినిమా అంటే.. 6 ఫైట్లు, 6పాటలు, 6 డాన్స్‌ూ, 6 కామెడీ సీన్స్‌ అనే రొటీన్‌గా ఫీలవుతున్నాడు. అలాంటివారికికూడా ఈ చిత్రం కొత్తగా వుంటుంది. స్క్రీన్‌ప్లే ఊహకు అందనివిధంగా వుంటుంది.
నీలకంఠ చిత్రాలంటే అవార్డు చిత్రాలనే అపప్రబద వుందికదా?
నాకు తెలిసి ఆయన కమర్షియల్‌ దర్శకుడు. ఆయన ప్రతిసినిమాలో ఆ అంశాలుంటాయి. కానీ ఆయన సినిమాకు చేసే ప్రమోషన్‌ విషయంలో చాలా వీక్‌. చాలాసార్లు ఆయనతో ఈ విషయాన్ని చెప్పాను. మాయచిత్రం కూడా పూర్తి కమర్షియల్‌గా వుంటుంది. రూపాయి సబ్బు గురించి కోట్లు ఖర్చుపెట్టి పబ్లిసిటీ చేస్తారు. అది మార్కెటింగ్‌ రహస్యం. అది సినిమాకూ వుండాలి.
అంతా కొత్తవారితో తీయడంవల్ల సినిమాకు ఏవైనా హెల్ప్‌ అవుతుందా?
అవుతుందనే నమ్మకం నాకుంది. తమిళరంగంలో ఎక్కువగా కొత్తవారితో సినిమాలు తీస్తుంటారు. జనాలు కూడా తెలిసిన ఫేస్‌లు చూసీచూసి విసుగెత్తుతున్నారు. అలాంటివారికి కొత్తవారు కావాలి. తెలుగులోనూఊహలు. గుసగుసలాడే’. ూయ్యాలజంపాల వంటి చిత్రాలు కూడా హిట్‌ అయ్యాయంటే కొత్తవారివల్లే.
ఎక్స్‌ట్రా సూపర్‌ పవర్‌ను నమ్ముతారా?
అసలు ఎక్స్‌ట్రా సూపర్‌ పవర్‌’ (ఇఎస్‌పి) అంటే ఏమిటో తెలిసేదికాదు. కానీ చాలా సందర్భాలు కొన్ని సంఘటనలు జరిగితే.. ఇదే ఇఎస్‌పి అని చెబుతుండేవారు. నేను ఇంజనీరింగ్‌ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎగ్జామ్స్‌కు సరిగ్గా ప్రిపేర్‌కాలేదు. ఏదో సినిమా చూసి రీలీఫ్‌ అయ్యాను. తెల్లారితే పరీక్షలుఅయితే అర్థరాత్రి నా మెదడులో 6 ప్రశ్నలు చదివితే అనిపించింది. అవే చదివాను. తెల్లారి పేపర్లో అవే వచ్చాయి. అలాగే మనం ఒకరిగురించి ఆలోచిస్తాం. వెంటనే అక్కడనుంచి ఫోన్‌ వస్తుంది. ఇదంతా ఇఎస్‌పి అంటారని తర్వాత తెలిసింది.
స్నేహగీతంతరహాలోనే లేడీస్‌ అండ్‌ జంటిల్‌మెన్‌వుంటుందా?
అది వేరు. ఇది వేరు. యూత్‌ సినిమానే కానీ అన్ని అంశాలుంటాయి. నా దృష్టిలో లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌.. అనేది విచ్చలివిడిగా వుంటుంది. అంటే మాట వినని కొడుకు కథ. అదే మాయచిత్రం మాటవినే కూతురులాంటిది.
నిర్మాతలకు థియేటర్లు అనుకూలంగావున్నాయా?
నాకు తెలిసి ఇంకా మంచి వాతావరణం రాలేదు. చిన్న నిర్మాతలకు ఎగ్జిబిటర్లు అంత అనుకూలంగా లేరు. ఒక సినిమా విడుదలైతే కనీసం మూడు వారాలపాటు ఆగేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సినిమా ఎగిరిపోతుంది.
మాయకు సెన్సార్‌ లేట్‌ కావడానికి కారణం?
సెన్సార్‌ లేటవ్వడానికి సెన్సార్‌ సభ్యులు ఏమాత్రంకాదు. నాకు నేనే కారణం. కొన్ని కారణాలవల్ల ఆలస్యం చేశాను. దాంతో చాలా మానసికంగా క్షోభను అనుభవించాను కూడా. అదేమిటనేది సినిమా తర్వాత చెబుతాను.
కొత్త చిత్రాలు?
దానకర్ణఅనే కాన్సెప్ట్‌ అనుకున్నాం. ఆ తర్వాత మాఫియాపై ఓ సినిమా చేయాలని వుంది. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని ముగించారు.



Post a Comment

 
Top