GuidePedia

0

ఆగలేకపోతున్న శృతి !!

మహేష్ బాబుతో మొదటిసారి తెరపై కనిపించబోతున్న శృతి. ఆ ఎక్సయిట్ మెంట్ ని దాచాలకపోతుంది . ఆగడు సినిమాలో ఆమె చేస్తున్నది ఐటెం సాంగ్ మాత్రమే అయినా కానీ శృతి ఆ అవకాశం తనకు వచ్చినందుకు తెగ సంబరపడిపోతుంది. అసలు ఈ పాటికే మహేష్ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం పలు మార్లు చేజార్చుకుంది . త్వరలో ఈ జంట ఓ సినిమాలో జతకట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నా.ముందుగా మహేష్ తో ఐటెం సాంగ్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని శృతి మిస్ చేసుకోలేదు .పైగా ఆ ఐటెం పాట కూడా తనే పాడింది. తమన్ చేసిన ఐటెం సాంగ్స్ లో ఇది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ పాట షూటింగ్ లో పాల్గొంటున్న ఆ సంగతులు షేర్ చేసుకుంటూ తెగ సంబరపడిపోతుంది శృతి హసన్ .ఎప్పుడెప్పుడు ఈ పాటని థియేటర్లలో ప్రేక్షకుల నడుమ కూర్చొని చూస్తానా అని ఎదురుచూస్తున్నానని శృతి హసన్ చెబుతుంది.పెద్ద హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శృతి హసన్ ఓ ఐటెం సాంగ్ విషయంలో ఇంతలా ఆత్రుతగా ఎదురుచూస్తుందంటే నిజంగానే ఈ పాట ఉర్రూతలు ఊహించేస్తుందేమో అనిపిస్తుంది కదా ! మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఆగడుచిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు . తమన్నా మహేష్ సరసన మొదటిసారి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతుంది .

Post a Comment

 
Top