GuidePedia

0

ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ !!


ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికొచ్చేశారు. రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసిన కేంద్ర కమిటి, రాజధాని సలహా మండలి చేసిన సూచనల మేరకు ప్రస్తుతానికి విజయవాడని తాత్కాలిక రాజధానిగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌకర్యార్ధం, ప్రభుత్వం పరిపాలనా సౌకర్యం కోసం హైదరాబాద్‌తో సంబంధం లేని నీటిపారుదల శాఖ, మత్సశాఖ వంటి ఇంకొన్ని ఇతర శాఖలు, విభాగాలని విజయవాడకి తరలించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఖాళీగా వున్న ప్రభుత్వ భూములు, భవనాల్ని గుర్తించి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సిందిగా అక్కడి అధికారులని బాబు ఆదేశించారు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వీరికితోడు మరికొంతమంది  మంత్రులు, కీలక శాఖల అధికార యంత్రాగం త్వరలోనే తమ వర్కింగ్ బేస్ మార్చుకుంటారని తెలుస్తోంది. 

Post a Comment

 
Top