GuidePedia

0

ఈ ఏడాదిలోనే 150వ సినిమా : MEK లో చిరు

ఈ సంవత్సరంలోనే తన 150వ సినిమా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. అయితే ఎప్పుడు ప్రారంభమవుతుందనేది అప్పుడే చెప్పలేన్నారు. మంచి కథ దొరికితే వెంటనే సినిమా చేసేస్తానని చెప్పారు. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షోకు ప్రత్యేక అతిధిగా చిరంజీవిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున.. 150 సినిమా ఎప్పుడని చిరంజీవిని ప్రశ్నించారు. చరణ్, నాగచైతన్య హీరోలైన తర్వాత మమ్మల్ని చూడాలనుకుంటున్నారా అని అక్కడున్న వారిని చిరంజీవి ప్రశ్నించగా... చూడాలనివుందంటూ నినదించారు. అభిమానుల కోసం తప్పకుండా మళ్లీ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పారు. ఈ ఏడాది సినిమా ప్రారంభవుతుందని, అయితే ఏ రోజు అనేది కచ్చితంగా చెప్పలేనన్నారు. షూటింగ్ ఎప్పుడనేది కథపై ఆధారపడివుందన్నారు. కథ ఎప్పుడు దొరికితే అప్పుడు సినిమా ఉంటుందని చిరంజీవి స్పష్టం చేశారు. దీంతో తన 150 సినిమాపై వస్తున్న ఊహాగానాలకు చిరంజీవి తెర దించారు.

Post a Comment

 
Top