GuidePedia

0

తెలుగు సినీ పరిశ్రమ పై దాసరి సంచలన వ్యాఖ్యలు !!


సమయం వచ్చినప్పుడల్లా తన మనసులో మాటని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పే ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత దాసరి నారాయణ రావు తాజాగా మరోసారి తెలుగు సినీపరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తెలుగు సినీపరిశ్రమంతా కొంతమంది నటీనటుల చేతుల్లోనే వుందని దాసరి ఆరోపించారు. 'మూవీ మొఘల్' పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సినీపరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమలో చాలా సమస్యలున్నాయని ఆయన గుర్తుచేశారు. సినీపరిశ్రమలో కొంతమంది బడా నిర్మాతలు థియేటర్లని తమ గుప్పిట్లో పెట్టుకుని చిన్న సినిమాల విడుదల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తూనే వున్నాయి. ఇదే విషయమై గతంలో చాలా సందర్భాల్లో చిన్న సినిమాల నిర్మాతలు ఓ సంఘంగా ఏర్పడి పెద్ద సినిమాల నిర్మాతలపై తమ అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలూ వున్నాయి. మరి ఈ నేపథ్యంలో దాసరి ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి వుంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ఆరోపణలు ఇవాళ కొత్తేమీ కాదు. కొన్ని సందర్భాల్లో పేర్లతో సహా ఆరోపించిన వాళ్లూ వున్నారు. అటువంటప్పుడు ఇలా ఆ వ్యక్తులు ఎవరో చెప్పకుండా దాసరి చేసిన ఆరోపణల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిందేనా అనేది ఇంకొంతమంది వాదన. ఏదిఏమైనా ఆ కొంతమంది వ్యక్తులు, నటీనటులు ఎవరో ఆ పెద్దమనిషి తన నోట తాను చెబితేనే బాగుంటుందనే టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. 


Post a Comment

 
Top