GuidePedia

0

హీరోయిన్ గా వెంకటేష్ పెద్ద కూతురు !!



తెలుగులో వెంకటేష్, మీనా జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దృశ్యం’. ఈ సినిమాలో వెంకటేష్ పెద్ద కూతురిగా నటించిన కృతిక జయకుమార్... నటిగా మొదటి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంలో కృతిక పాత్ర కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో హీరోయిన్ ఆఫర్లు వస్తున్నాయి.
తాజాగా ఓ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యింది. శ్రీధర్ సీపాన దర్శకుడిగా మారి, బ్రహ్మనందం తనయుడు గౌతమ్ తో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఇందులో హీరోయిన్ గా కృతికను ఎంపిక చేసారు. ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. లవ్, ఎంటర్ టైన్మెంట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కృతిక గ్లామర్ పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకోబోతుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
తెలుగులో ఒక్క సినిమాకే హీరోయిన్ గా అవకాశం రావడంతో ఈ అమ్మడు ఆనందంతో ఫుల్ ఖుషీలో వుందట. ఇప్పుడున్న యువ హీరోయిన్లకు ధీటుగానే ఈ అమ్మడు గ్లామర్ పిచ్చెక్కించనుందో లేక కేవలం నటనను నమ్ముకునే సినిమాలు చేయనుందో త్వరలోనే తెలియనుంది.

Post a Comment

 
Top