GuidePedia

0


బ్యానర్  : సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజిల్స్ టాకీస్
చిత్రం  : గాలిపటం
చేకోడి రేటింగ్  : ★★½ - 2.5
నటినటులు  : ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, రాహుల్ తదితరులు
సంగీతం  : భీమ్స్ సెసిరోలియో
ఛాయాగ్రహణం  : బుజ్జి. కె
ఎడిటర్  : రాంబాబు
నిర్మాత  : సంపత్ నంది, కిరణ్ ముప్పవారపు, విజయకుమార్ వట్టికుటి మేడికొండ
దర్శకుడు  : నవీన్ గాంధీ
గతకొద్ది రోజులుగా హిట్లు లేని ఆది హీరోగా నటించిన చిత్రం గాలిపటం. ప్యార్ మే పడిపోయానే సినిమా యావరేజ్ టాక్ అనిపించినా కూడా సరైన విజయం సాధించలేకపోయింది. ఆది హీరోగా నటించిన ఈ గాలిపటం చిత్రాన్ని దర్శకుడు సంపత్ నంది నిర్మించాడు. నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆది సరసన ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవాలు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దామా!

కథ :  కార్తీ (ఆది) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌. పరిణితి (క్రిస్టినా ఎకీవా)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెని పెళ్లి కూడా చేసుకోవాల‌నుకొంటాడు. కానీ ఆమెకి పెళ్లిపై న‌మ్మ‌కం లేదు. అందుకే ఆ బంధానికి దూరంగా క‌లిసుందాం అంటుంది. కార్తీ ఒప్పుకోకుండాత‌న త‌ల్లిదండ్రులు చూసిన సంబంధాన్నే చేసుకొంటాడు. స్వాతి (ఎరికా) అంద‌మైన అమ్మాయి. ఆదిలాగే పెళ్లి బంధంపై న‌మ్మ‌క‌మున్న అమ్మాయి. అందుకే ఆమె వేరొక‌రిని ప్రేమించినా అత‌న్ని కాద‌నికార్తీని చేసుకొంటుంది. వీరిద్ద‌రూ క‌లిసి కాపురం పెట్టాక.. ఒక‌రి ప్రేమ‌క‌థ‌ల్ని మ‌రొక‌రు చెప్పుకొంటారు. మ‌రి వీరి మ‌ధ్య కాపురం ఎలా సాగింది. ప్రేమ లేకుండా కేవ‌లం బంధంతోనే జీవితాన్ని నెట్టుకొచ్చారా? ఇంత‌కీ ప‌రిణితిని ప్రేమించిన ఆ యువ‌కుడు ఎవ‌రు? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
న‌టీన‌టులు :  గత సినిమాలతో పోల్చుకుంటే ఆది ఈసారి మంచి నటనను ప్రదర్శించడంతోపాటు మెరుగైన లుక్స్ తో అదిరిపోయాడు. లవ్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ కథాచిత్రం కాబట్టి.. యాక్షన్ హీరోగా పేరున్న ఆదికి ఈ సినిమా అంతగా సూట్ అవ్వలేదు కానీ.. కాస్త ఫర్వాలేదనిపించుకున్నాడు. రాహుల్‌ ఇంకా అందాల రాక్షసిహ్యాంగోవర్‌లోనే ఉన్నాడో, లేక అతడిని అదే చేయమని అడిగారో కానీ అచ్చంగా అలాగే నటించాడు. ఎరికా ఫెర్నాండెజ్‌, క్రిస్టీనా ఇద్దరూ ఫర్వాలేదు. కొత్తవాళ్లయినా కానీ ఓకే అనిపించారు. ఎరికా ఫెర్నాండెజ్ తన లుక్స్ తో అందరినీ మెస్పరైజ్ చేసేసిందని చెప్పుకోవచ్చు. కొన్నికొన్ని సందర్భాల్లో అద్భుతంగా తన నటననను కనబరిచింది. కానీ కొన్ని చోట్ల మాత్రం పేలవ పెర్మాన్సెన్స్ తో సరిపెట్టుకుంది. ఇక క్రిస్టినా అందం పరంగా చాలానే బాగుంది కానీ.. సీన్లకు తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది.
సాంకేతిక విభాగం : సంపత్ నంది ఈ కథ కోసం బాలీవుడ్ సినిమాల నుంచి కొన్ని పాయింట్స్ ని స్పూర్తిగా తీసుకున్నాడు.  అలాగే తమిళ్ డబ్బింగ్ సినిమా “రాజా రాణి” ని పోలి కథ ఉంటుంది. మరో వైపు ఇది ఏమైంది ఈ వేళా సెక్వెల్ అని కూడా అనిపిస్తుంది. అతను రాసిన సంభాషణల్లో కూడా అదే బోల్డ్‌నెస్‌ కనిపించింది. అయితే చాలా సందర్భాల్లో సంభాషణల్లో వల్గారిటీ అవధులు దాటింది. దర్శకుడికి మొదటి సినిమా కాబట్టి.. సినిమాను బాగా తెరకెక్కించడంలో బాగానే ప్రయత్నించాడు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంచుకునే బ్యాగ్రౌండ్స్ అంతగా ఆకర్షించినట్లుగా వుండవు. భీమ్స్ సెసిరోలియో వారు అందించిన సంగీతం ఫర్వాలేదు. ముఖ్యంగా అద్నాన్ సమి పాడిన పాట వింటే.. అందరి ప్రేమలోకంలో మునిగిపోవాల్సిందే. సెకండాఫ్ లో వచ్చే మందేసెయ్ మావా పాట కూడా అద్భుతంగా వుంటుంది. బుజ్జి అందించిన ఛాయాగ్రహణం కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా వుంటే.. మరికొన్ని సన్నివేశాల్లో ఫర్వాలేదని సరిపెట్టుకోవాల్సి వస్తుంది.
విశ్లేషణ : ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే అందించిన సంపత్ నంది...తొలి చిత్రం ఏమైంది ఈవేళ కూడా ఇలాంటి కాన్పెప్ట్ తోనే హిట్ కొట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఆ సినిమాకు రాసుకున్న మరో వెర్షన్ లా ఈ గాలిపటం కథ అనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా ఒకే పాయింట్ మీద వెళ్లకుండా రకరకాల విషయాలను తలకెత్తుకోవటంతోనే కన్ఫూజన్ స్టార్టైంది. పెళ్లికి ప్రేమలు...పెళ్లయ్యాక ఏర్పడే అక్రమ సంభందాలు, సిటీలో గే కల్చర్, వయస్సులో పెద్దవాళ్లను పిల్లలు వదిలేసి వెళ్లిపోవటం ఇలా లెక్కకు మించిన ఎలిమెంట్స్ ని ఒకే కథలో ఇమిడ్చి చెప్పాలన్న తాపత్రయమే ఈ కథను పూర్తిగా దెబ్బకొట్టింది. దాంతో ఏ పాయింటూ మీదా డెప్త్ కు వెళ్లిలేక సీరియస్ లేని సీరియస్ సినిమాగా మారిపోయింది. ముఖ్యంగా దర్శకుడు ఈ కథని తెరకెక్కించటంలో విఫలమయ్యాడనిపించింది. స్లో నేరేషన్, ఎప్పుడు చూసినా పాత్రలు మాట్లాడుకుంటూ ఉండటం వంటివి సాధ్యమైనంత తగ్గించుకోవాల్సింది. కామెడీ పేరుతో అనవసరమయిన సన్నివేశాలను కత్తిరించేసి ఉంటె చాలా బాగుండేది. ఇది యూత్ మాత్రమే చూడదగ్గ చిత్రం వారిని ఉద్దేశించి తీసిన చిత్రం.. కాని చివర్లో ఇటు ప్రస్తుత జనరేషన్ కి అటు ముందు జనరేషన్ కి మధ్య వచ్చిన సమస్యకి పరిష్కారం అసలు చూపెట్టలేదు. ఇది క్లీన్ "Y" చిత్రం అంటే యూత్ చిత్రం కాబట్టి.. మీరు మీ స్నేహితులు కలిసి ఒకసారి చూడదగ్గ చిత్రం ...

చేకోడి రేటింగ్  : ★★½ - 2.5





Post a Comment

 
Top