GuidePedia

0

త్రిష పెళ్లి చేసుకుంది !!

ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో అగ్ర, యువ స్టార్ హీరోలందరితో కలిసి నటించిన త్రిష.. ఇలా ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకోవడమేంటనీ అనుకుంటున్నారా? అయితే త్రిషకు పెళ్లయినా మాట వాస్తవమే కానీ... అది నిజజీవితంలో మాత్రం కాదు. కన్నడలో ఈ అమ్మడు నటిస్తున్న పవర్సినిమాలో ఓ సన్నీవేశం కోసం త్రిష పెళ్లి చేసుకొంది. కావాలంటే మీరు ఓ లుక్కేయండి.
తెలుగులో మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం దూకుడు’. మహేష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా దూకుడు నిలిచింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దూకుడుచిత్రాన్ని కన్నడలోకి రీమేక్ చేస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా పవర్పేరుతో రీమేక్ చేస్తున్నారు.
అయితే తెలుగు దూకుడుచిత్రంలో మహేష్, సమంతల పెళ్లి పాట వుంది కదా! ఆ పాట చివర్లో మహేష్ సమంతను పెళ్లి జరిగే సన్నీవేశం గుర్తుంది కదా! తాజాగా ఇదే సన్నీవేశాన్ని కన్నడ పవర్సినిమాలో చిత్రీకరించారు. ఇందులో పునీత్, త్రిషలు పెళ్లి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందనే నమ్మకంతో వున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే మహేష్ విడుదల చేసాడు. పాటలకు, ట్రైలర్స్ కు మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Post a Comment

 
Top