GuidePedia

0


కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గోవిందుడు అందరివాడేలే’. రాంచరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ ప్రధాన పాత్రలలో నటించారు. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను నిన్న విడుదల చేసారు. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దర్శకుడు కృష్ణవంశీ చాలా ఎమోషనల్ అయ్యారు.
కృష్ణవంశీ మాట్లాడుతూ... ఈ సినిమాకు ముందు చాలా రకాల కామెంట్లు... చూస్తే మోహం తిప్పేసుకోవడం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. చాలా లోన్లీగా అయ్యాను. చచ్చిపోయానా అన్నట్లుగా అనిపించేది. ఇక నా పని అయిపోయిందా అని అనుకొని.. ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అన్నయ్య(చిరంజీవి) గుర్తొచ్చారు. అప్పుడు అన్నయ్య రాజకీయాల్లో బిజీగా వుండటం వల్ల కలవడం కుదర్లేదు. కానీ అన్నయ్యను కలిసి చరణ్ తో ఓ సినిమా చేద్దామనుకుంటున్నా అని చెప్పాలనుకున్నా. కానీ అది అన్నయ్య బిజీగా వుండటం వల్ల కుదర్లేదు. అయితే చరణ్ మేనేజర్ కు ఫోన్ చేసి.. చరణ్ ఏదైనా ఒకరోజు ఖాళీగా వుంటే అపాయింట్ మెంట్ ఇస్తావా.. ఇలా ఓ లైన్ చెప్పాలి అని అడిగాను. ఒక నెల తర్వాత స్పందిస్తారేమో అనుకున్నాను. కానీ 10 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. చరణ్ సార్ ఇప్పుడు ఫ్రీగా వున్నారు వచ్చి కలవండి అని.
వెళ్లి కలవగానే చరణ్ సంస్కారం నన్ను ఆకట్టుకుంది. పెద్దలకు అతను ఇచ్చే మర్యాద చాలా నచ్చింది. ఓ 20 నిమిషాల్లో లైన్ చెప్పగానే వెంటనే నచ్చి, సినిమా చేద్దాం అని చెప్పాడు. ఆ తర్వాత అన్నయ్య ఇంటికి వెళ్తే.. నువ్వేం చెప్పావో తెలియదు.. వాడేం విన్నడో తెలియదు కానీ.. మనం సినిమా చేస్తున్నాం.. ఇపుడు మళ్లీ ఓ సారి కథ చెప్పుఅని అన్నారు. కథ మళ్లీ ఓ 20 నిమిషాలు చెప్పగానే వెంటనే మనం ఈ సినిమా చేస్తున్నాంఅని చెప్పేసారు.
అలా నేను ఇప్పటివరకు ఎంతో మందికి అవకాశం ఇచ్చాను కానీ.. నాకెవడు అవకాశం ఇవ్వలేదు. కానీ నాకు అవకాశమిచ్చిన వాడు ఒకడున్నాడు అని గర్వంగా చెప్పుకోగలను. అతనే రాంచరణ్. చరణ్ తో వుంటే అన్నయ్యతో వున్నట్లుగానే అనిపిస్తుంది. అలాగే అన్నయ్యతో ఇళయరాజాగారు పనిచేసారు. ఇపుడు చరణ్ తో ఇళయరాజా గారి అబ్బాయి యువన్ శంకర్ రాజా పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ నా సినిమా అవడం ఆనందంగా వుంది.
నాకు సరైన వయసులో పెళ్లయ్యి వుంటే చరణ్ లాంటి కొడుకుండేవాడు. కానీ నా బిడ్డలాగే చూసుకుంటాను. ఈ సినిమా కుటుంబసమేతంగా, హాయిగా అందరూ కలిసి చూసి, ఆనందించే విధంగా వుంటుంది. ఈ సినిమా ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోతుంది అని అన్నారు.

Post a Comment

 
Top