మూవీ :
లవర్స్
చేకోడి
రేటింగ్ : 2.75/5
నటీనటులు
:సుమంత్ అశ్విన్, నందిత, షామిలి,
తేజస్విని, ఎం.ఎస్.నారాయణ, ఆహుతి ప్రసాద్, సాయి, నవీన్,
చిట్టి, సన, తదితరులు
కెమెరా:మల్హర్
భట్ జోషి,
సంగీతం:జె.బి.,
ఎడిటింగ్:
ఉద్ధవ్.ఎస్.బి., నిర్మాతలు:సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు.బి.,
కథ, స్క్రీన్ ప్లే,
మాటలు, సమర్పణ:మారుతి,
రచన, దర్శకత్వం:హరి.
విడుదల తేది:
15, ఆగస్టు 2014.
నవతరం ఆలోచనలు కొత్తగానే ఉంటున్నాయి. కానీ అవి తెరపైకి వచ్చేసరికి
మూస ధోరణిలోకి వెళుతున్నాయి. అసలు తప్పెక్కడ జరుగుతోంది? మధ్యలోవాళ్లు ఆ `కొత్త` ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తున్నారా?
కమర్షియల్ కోణం అంటూ ఆయా కథల్లో జోక్యం చేసుకొని చిందరవందర చేసేస్తున్నారా?
`లవర్స్` చూస్తే అదే అనిపిస్తోంది. దర్శకుడు
లవర్స్ మనస్తత్వాల్ని విశ్లేషిస్తూ ఓ కొత్త రకమైన సినిమా తీయాలనుకొన్నట్టున్నారు.
కానీ ఆ కథలో కామెడీ పేరుతో నానా కంగాళీ కూడా చేరింది. దీంతో సినిమా రుచీపచీ
లేకుండా తయారైంది. అందుకు కారణం దర్శకుడి స్వయం కృతాపరాధమేనా లేదంటే వేరెవరైనా
ఉన్నారా? ఆ విషయం దర్శకుడే చెప్పాలి. ఇంతకీ `లవర్స్` సినిమా ఫ్లేవర్ ఏమిటో, ఆ సినిమా కథేమిటో తెలుసుకొందాం పదండి.
కథ
: ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో
సిద్దు(సుమంత్ అశ్విన్) గీత(తేజస్వి) ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమ మధ్యలోనే
బ్రేకప్ అయిపోతుంది. ఆ తర్వాత సిద్దు సౌమ్య(షామిలి)ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కుడా
కొద్ది రోజుల్లోనే బ్రేకప్ అయిపోతుంది. కట్ చేస్తే సిద్దు రెండు లవ్ స్టోరీస్
ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం చిత్ర బాలసుబ్రమణ్యం(నందిత). ఇది జరిగిన కొద్ది రోజులకి
సిద్దు ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరతాడు. అక్కడ ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు.
కానీ ఆ ప్రేమలో కూడా సిద్దు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇబ్బందులు
ఏమిటి?
అసలు చిత్ర బాలసుబ్రమణ్యం ఎందుకు సిద్దు లవ్ స్టోరీస్ ని ఫెయిల్
అయ్యేలా చేసింది? అసలు సిద్దు – చిత్ర
బాలసుబ్రమణ్యంకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మీరు
తెరపైనే చూడాలి.
నటినటులు
: ఈ సినిమా పరంగా సప్తగిరిని కమెడియన్ అనడం
కంటే హీరో అనే అనాలి. ఎందుకంటే సెకండాఫ్ లో మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా
నవ్వించేది సప్తగిరి మాత్రమే.. అతని పాత్ర పరిచయం అయినప్పటి నుంచి చివర్లో అతని
పాత్ర మాయమయ్యే దాకా ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు. అమ్మాయిలంటే అస్సలు పడని పాత్ర
చేసిన సప్తగిరిపై షూట్ చేసిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ఆరడుగుల బుల్లెట్ స్పూఫ్, ప్రేమకథా
చిత్రమ్ కంటిన్యూ సీక్వెన్స్ కడుపుబ్బా నవ్విస్తుంది. సుమంత్ అశ్విన్ సాదాసీదాగా నటించాడు.
లవ్ సీన్స్‌లోనూ, డ్యాన్సుల్లోనూ పర్వాలేదనపించినా..
భావోద్వేగాలు పండించడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఆ విషయంపై జాగ్రత్తలు
తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. `ప్రేమకథా చిత్రమ్`లో నటనతో ఇందులో నందితని పోలిస్తే… ఆ అమ్మాయే ఈ
అమ్మాయా అని సందేహం కలగకమానదు. ఏ సన్నివేశంలోనూ ఆకట్టుకోలేకపోయింది. అందం
విషయంలోనూ తేజస్వి, షామిలీ డామినేట్ చేశారు. ఎమ్మెస్ నారాయణ,
చాందిని, అనిత చౌదరి తమ పాత్రల పరిధి మేరకు
నటించారు. ఇక అంతకుమించి ఎవ్వరి గురించీ ఎక్కువగా చెప్పుకోవడానికి లేదు.
సాంకేతిక
వర్గం : జె.బి. సంగీతం
చాలా బాగా కుదిరాయి పాటలు బాగున్నాయి. వాటిని బాగా పిక్చరైజ్ చేసారు.
సినిమాలో కెమెరా వర్క్ కూడా ఓ ప్లస్ కలర్ ఫుల్ గా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగా చేసారు.
సూటిగా సుత్తి లేకుండా సినిమాని నీట్ గా తీసుకెళ్లటంలో సాయిం చేసింది. మారుతి కథా,కథనాన్ని
దర్శకుడు చక్కగా, జనాలుకు నచ్చేలా తెరకెక్కించాడు. కామెడీపై
తనకి గ్రిప్ ఉందని, ఎంటర్టైన్మెంట్ సినిమాని హ్యాండిల్
చేయగలనని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఎప్పటిలానే మారుతి మార్క్ డబుల్
మీనింగ్ డైలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అందులో కొన్నిటిని
సెన్సార్ వారు మ్యూట్ చేయడం కూడా జరిగింది. హరినాథ్ మొదటి సినిమాతో చెప్పుకోదగ్గ
స్థాయిలోముద్రవేసుకోలేకపోయాడు.
విశ్లేషణ : కొన్ని కామెడీ సీన్స్, ఒక కమిడియన్
కరెక్టుగా వర్కవుట్ అవుతే సినిమా హిట్టవుతుందా... అవుతుంది అని మీకు ఈ సినిమా
చూస్తే అనిపిస్తుంది. కామెడీ ఉంటే చాలు కనకవర్షం అనేది తెలుగు సినిమా ప్రస్తుత
పరిస్ధితి. దాన్ని పూర్తిగా అర్దం చేసుకుని మారుతి సినిమాలు
చేస్తున్నారు...రాస్తున్నారు(ఒక్కోసారి వికటిస్తున్నాయనుకోండి) . ముఖ్యంగా
కమిడియన్ సప్తగిరి లోని పూర్తి స్టామినాని వాడుకుని చేసిన ఈ చిత్రం సెకండాఫ్ లో
మంచి నవ్వులు కురిపించి నిలబెట్టింది. కథ,కథనాలు వంటి
మొహమాటాలు పెట్టుకోకండా కేవలం కామెడీనే నమ్ముకుని చేసిన ఈ చిత్రం పైసా వసూల్ గా
ఫ్యామిలీలకు అనిపిస్తుంది...కనిపిస్తుంది. హీరో సంగతేమో కానీ సప్తగిరి కి మాత్రం
మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం. సెకండాఫ్ లో వచ్చే సప్తగిరి ఎంటర్టైన్మెంట్, సినిమాటోగ్రఫీ,
మ్యూజిక్ ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే స్టొరీ లైన్ లేకపోవడం,
ఫస్ట్ హాఫ్, సందర్భం లేకుండా వచ్చే పాటలు ఈ
సినిమాకి మేజర్ మైనస్ పాయింట్స్.
చేకోడి రేటింగ్ : 2.75/5
Post a Comment