వర్మ పై మరో కేసు !!
వినాయకుడిపై ట్విట్టర్‑లో వ్యాఖ్యలు
చేసి.. ప్రజల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీశారంటూ ప్రముఖ దర్శకుడు రాంగోపాల్
వర్మపై ముంబైలోని ఓ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణను
అంధేరి మేజిస్ట్రేట్ ఈనెల 30వ తేదీకి పోస్ట్ చేశారు. ఇండస్
కమ్యూనికేషన్స్ ఎండీ, కన్స్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా
మీడియా సెల్ అధ్యక్షుడు అయిన వివేక్ శెట్టి కోర్టులో ఈ మేరకు ఫిర్యాదు చేశారు.వినాయకుడు
తన భక్తుల కష్టాలు ఎందుకు తీర్చలేకపోతున్నాడని రాంగోపాల్ వర్మ ప్రశ్నించడమే కాక..
ఆయన శారీరక విషయాలపై కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడని ఆ ఫిర్యాదులో
పేర్కొన్నారు. ఇవి హిందువుల మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నారని అందులో
తెలిపారు. ఐపీసీ సెక్షన్లు 295ఎ, 504, 505లను వర్మ ఉల్లంఘించినట్లయిందన్నారు.
Post a Comment