GuidePedia

0

చిరుని ఏడిపించిన కృష్ణవంశి !!

ఆమధ్య గోవిందుడు అందరివాడేలే సినిమా టీజర్ విడుదల సమయంలో కృష్ణవంశీ తన అహంకారంతో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయినట్లు బహిరంగంగా చెప్పడమే కాకుండా మీడియా సాక్షిగా కృష్ణవంశీ కనీరు పెట్టుకున్నప్పుడు రామ్ చరణ్ కృష్ణవంశీని ఓదార్చడం ఆ వేడుకకి హాట్ న్యూస్ గా మారింది. ఈ సంఘటన జరిగి కొన్నివారాలు కాకముందే కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభను చూసి కన్నీరు పెట్టుకోవడం చిరంజీవి వంతయిందని అంటూ వార్తలు వస్తున్నాయి. సినిమా షూటింగ్ ఇంచు మించు పూర్తయి చివరి దశలో ఉన్న ఈ సినిమా రషన్ ని చిరంజీవి ఈమధ్య కృష్ణవంశీతో కలసి చూశాడట . ఈ సినిమాలోని అద్భుతమైన సెంటిమెంట్ సీన్ చూసిన చిరంజీవి  తన్మయత్వంతో కంట కన్నీరు పెడుతూ కృష్ణవంశీని కౌగిలించుకొని  అభినందించడమే కాకుండా తానూ రామ్ చరణ్ ని మంచి నటిడిగా చూడాలని ఎలా ఆశించానో అంత అద్భుతంగా చుపెట్టినందుకు కృష్ణవంశీని పొగడ్తలతో ఈ సినిమా ఎడిటింగ్ ల్యాబ్ లో పొగిడి అందరిని ఆశ్చర్యపరిచాడట చిరంజీవి .

Post a Comment

 
Top