చిరంజీవి - పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్య ఘర్షణ !!
మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి,
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
అభిమాన సంఘాల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నాయి. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న
చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్ నుంచి ఆదేశాలు
వచ్చినట్టు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్
తెలిపారు. త్వరలోనే పవన్ కల్యాణ్ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్
తెలిపారు. ఈ నెల 30 తిరుపతిలో చిరంజీవి, పవన్ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. 30న ఫ్యాన్స్‌డేగా
జరపాలని నిర్ణయించామని చెప్పారు.
Post a Comment