GuidePedia

0

'ఐ' దెబ్బని తట్టుకోలేకపోతున్న చెర్రీ !!

మెగా హీరో రామ్ చరణ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే. ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ తాజాగా వైభవంగా జరిగింది. దీంతో గోవిందుడు అందరివాడేలే మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్, అలాగే మూవీకి సంబంధించిన సాంగ్ క్లిప్స్, మరికొన్ని ఎక్స్ క్లూజివ్ విజువల్స్ బయటకు వచ్చాయి. మూవీకి సంబంధించిన థియోట్రికల్ ట్రైలర్ చూసిన తరవాత, ఇప్పుడు ఆ టాక్ మారిపోయింది. గోవిందుడు అందరివాడేలే మూవీ నిజంగా బ్లాక్ బాస్టర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అనే క్రేజ్ జనాల్లోకి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో వచ్చిన మ్యూజికల్ సాంగ్స్ లో గోవిందుడు అందరివాడే మూవీ సాంగ్స్ వినటానికి చాలా సింపుల్ అండ్ సూపర్బ్ గా ఉన్నాయి. మూవీకి సంబంధించిన అన్ని విజువల్స్ బయటకు వచ్చిన తరువాత అందరూ గోవిందుడు అందరివాడేలే జపం చేస్తారు అని అనుకున్నారు. కాని అదే రోజు శంకర్ తెరకెక్కించిన ఐ మూవీ ఆడియో లాంచ్ జరిగింది. అలాగే ఐ మూవీకి సంబంధించిన టీజర్ ని శంకర్ రిలీజ్ చేశాడు. ఐ మూవీ టీజర్ ప్రస్తుతం యూ ట్యూబ్ సన్షేషనల్ రెస్పాన్స్ ని పొందుతుంది. ఇప్పటి వరకూ ఐ మూవీ టీజర్ విడుదలయిన 19 గంటల్లోనే దాదాపు 13 లక్షలకు పైగా మంది చూశారు. కాని రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే టీజర్ ని 18 గంటల్లో కేవలం 90 వేల మంది మాత్రమే చూశారు. దీంతో ఐ మూవీ టీజర్ కారణంగా గోవిందుడు అందరివాడేలే మూవీకి సంబంధించిన ఇంటర్నెట్ ప్రమోషన్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఐ మూవీలో హీరోగా నటించిన విక్రమ్, రామ్ చరణ్ ని షేక్ చేస్తున్నాడనే టాక్ , సోషియల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో బలంగా వినిపిస్తుంది.

Post a Comment

 
Top