GuidePedia

0

సెల్వమణి తో విడిపోలేదు : రోజా

రోజా కథానాయికగా నటించిన తొలి చిత్రం 'చెంబరుత్తి' (తమిళ సినిమా)కి సెల్వమణి దర్శకుడు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ ఇద్దరి ప్రేమ కొన్నేళ్ల పాటు నిలకడగా సాగింది. దాదాపు ఏడెనిమిదేళ్లు ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కొంతమందిలా ఈ ఇద్దరూ విడిపోతారని చాలామంది భావించారు. కానీ, పెళ్లి చేసుకుని, తమది నిజమైన ప్రేమ అని నిరూపించుకున్నారు రోజా, సెల్వమణి. పెళ్లయినప్పట్నుంచీ వీరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు ఎక్కడా వార్తలు రాలేదు. కానీ, ఈ ఇద్దరూ విడిపోయారనే వార్త ఇటీవల ప్రచారంలో ఉంది. ఏడెనిమిదేళ్ల ప్రేమాయణం, పదేళ్ల వైవాహిక జీవితం ... మొత్తం మీద వీళ్ల అనుబంధం వయసు దాదాపు 20 ఏళ్లు. ఇన్నేళ్ల అనుబంధంలో ఇద్దరి మధ్య మంచి అవగాహన వచ్చి ఉంటుంది. అందుకని ఇప్పుడు విడిపోవడానికి అవకాశాలు తక్కువ. మరి.. వీడిపోయారనే వార్త రావడానికి  కారణం సెల్వమణి చెన్నయ్ లో, రోజా హైదరాబాద్ లో ఉండటమే. దీని గురించి రోజా స్పందిస్తూ...
''నేను రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ తమిళనాడుకి సంబంధించిన పార్టీలో ఉండి ఉంటే నేను చెన్నయ్ లో ఉండేదాన్ని. కానీ, ఆంధ్ర రాష్ర్ట రాజకీయాల్లో ఉండటం వల్ల నేను హైదరాబాద్ లో ఉంటున్నాను. మా వారికి తమిళ సినిమా పరిశ్రమతో అనుబంధం ఉంది కాబట్టి, చెన్నయ్ లో ఉంటున్నారు. వీలు కుదిరినప్పుడల్లా హైదరాబాద్ వస్తుంటారు. మా వృత్తిరీత్యా వేరే వేరే రాష్ర్టాల్లో విడివిడిగా ఉంటున్నామే తప్ప విడిపోలేదు'' అని రోజా స్పష్టం చేసింది. ప్రస్తుతం రోజా నగరి ఎమ్మల్యే అన్న సంగతి తెలిసిందే.

Post a Comment

 
Top