GuidePedia

0

బెంగుళూరు డేస్ లో ఎన్టీఆర్

రామయ్య వస్తావయ్యసినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా రభస’. రామయ్య వస్తావయ్య’, ‘రభససినిమాలు ఎన్టీఆర్ కి అంత సంతృప్తి ఇవ్వకపోవడంతో ఎన్టీఆర్ తన ఇమేజ్ ని చేంజ్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాట్ట. ఈ ప్రయత్నంలో భాగంగా, వంశీ పైడిపల్లీ డైరక్షన్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా నటించబోతున్నాడట.అలాగే మరో పక్క, నిర్మాత దిల్ రాజు మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన బెంగుళూరు డేస్ని రీమేక్ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ గా తెరకెక్కబోయే ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఓ హీరోగా ఎంపిక చేయాలని అనుకుంటున్నాడట దిల్ రాజు. ఇప్పటికే దిల్ రాజు ఎన్టీఆర్ తో ఈ సినిమాకి సంబంధించిన చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి బొమ్మరిల్లుభాస్కర్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో కాజల్ కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉందని సమాచారం.

Post a Comment

 
Top