GuidePedia

0

ఎన్టీఆర్ - నాగ చైతన్యల మల్టీ స్టారర్ ??

యంగ్‌టైగర్ ఎన్టీఆర్  కెరీర్ వరుస ఫ్లాప్స్‌.. తనకు, ఇండస్ట్రీ వర్గాలకు  కూడా అంతుపట్టుకుండా సాగుతోంది. ఎలాంటి మూవీ చేయాలి? ఏ డైరెక్టర్‌తో చేయాలనే కన్ఫ్యూజన్లోనే వన్ బై వన్ సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ ఓ షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నాడని ఇన్‌సైడ్ న్యూస్. మలయాళ సూపర్ హిట్ బెంగళూర్ డేస్‌ను తెలుగులో బొమ్మరిల్లుభాస్కర్ డైరెక్షన్లో దిల్ రాజు - పీవీపీ బ్యానర్ రీమేక్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో ఇప్పటికే సిద్ధార్ద్ - నాగచైతన్య - ఆర్య - సమంత లీడ్ రోల్స్ చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇపుడీ స్టారర్ టీంలో ఎన్టీఆర్ చేరుతున్నాడని లేటెస్ట్ ఫిల్మ్‌నగర్ టాక్. మళయాళ వెర్షన్ చూసి  ఇంప్రెస్ అయ్యి స్టార్ డం ను పక్కనపెట్టి ఇలాంటి మూవీలో చేస్తే ఇమేజ్ మారుతుందని కెరీర్ కొత్తగా మేకోవర్ చేస్కోవచ్చని  ఎన్టీఆర్ అనుకుంటున్నట్టు టాక్. పైగా నందమూరి - అక్కినేని మూడో తరం వారసుల మల్టీ స్టారర్ అంటే ఫ్యాన్స్‌లో, ఆడియన్స్‌లో  క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంటుందని దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

Post a Comment

 
Top