పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలో అభిమాని మృతి !!
పవన్ పుట్టినరోజు సంధర్భంగా తమ అభిమానాన్ని
చూపించాలనే వుద్దేశ్యంతో భారీ ఫ్లెక్సులను ఏర్పాటు చేయడానికి పవన్ అభిమాన సంఘాలు
పలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రకాశం జిల్లా చినగంజాంలో
అభిమానులు వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నారు. బర్త్ డే విషెస్ తెలిపే ఫ్లెక్సీ
కడుతుండగా.., గోనినేని రమేష్ అనే అభిమానికి ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలాయి. షాక్
తగలటంతో అభిమాని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇదే ఘటనలో మరో ముగ్గురు
గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇలాంటి అనుకోని సంఘటనలకు పవన్ ముందుగానే స్పందిస్తూ
వుంటాడు. అలాంటిది తన అభిమాని, తన పుట్టినరోజు వేడుకల్లో మృతి చెందితే
పవన్ మాములుగా ఎలా వుండగలుగుతాడు చెప్పండి. పవన్ కు ఈ విషయం తెలిసిందో లేదో
తెలియదు కానీ... తెలిస్తే మాత్రం వెంటనే స్పందిస్తాడని అంటున్నారు పవన్ అభిమానులు.
చూద్దాం... ఏం జరుగనుందో.
Post a Comment