పవన్ కళ్యాణ్ నా గురువు : రేణు దేశాయ్

చిత్ర నిర్మాణానికి సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ తనకు
గురువు అని సినీనటి, దర్శకురాలు రేణుదేశాయ్ అన్నారు. తాను 1999
నుంచి చిత్ర నిర్మాణంలో మెలుకువలు నేర్చుకుంటున్నానని ఆమె తెలిపారు.
నా జీవితంలో పవన్ కళ్యాణ్ కంటే మంచి టీచర్ ఎవరూ లేరు అని సోషల్ మీడియా వెబ్ సైట్
ఫేస్ బుక్ లో రేణు దేశాయ్ తెలిపారు. ఫిల్మ్ మేకింగ్ పరిపూర్ణతను
సాదించడానికి సహకరించిన పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటానని ఆమె అన్నారు. అయితే
జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా చోటు చేసుకుంటాయని, తాను తొలిసారి
దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను వాస్తవానికి ఆగస్టు 26
తేదిన విడుదల చేయాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాల వలన ట్రైలర్ విడుదల
కార్యక్రమం సెప్టెంబర్ 2 తేదికి వాయిదా పడింది. అయితే ఆరోజు పవన్
కళ్యాణ్ పుట్టిన రోజు కావడం యాదృచ్చికంగా జరిగిందన్నారు. అయితే తనకు ఫిల్మ్
మేకింగ్ లో మెలుకువలు నేర్పిన పవన్ కళ్యాణ్ జన్మదినం రోజున విడుదల చేయడం అనేది
భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా భావిస్తానని ఆమె అన్నారు. ఎక్కడో చదివాను, యాదృచ్చికంగా జరిగే సంఘటనలు మన ఆలోచనలకు దేవుడు ఇచ్చే సమాధానాలని.. ఇదే
విషయాన్ని పవన్ తో చెప్పితే నవ్వి ఊరుకున్నారని రేణుదేశాయ్ తెలిపారు.
Post a Comment