గోపాల గోపాలలో పవన్ లుక్ ఇదే !!
పవన్ కళ్యాణ్ తాజా సినిమా గోపాల గోపాల సినిమాకి సంబందించిన
పవన్ గెటప్ పై పరిశ్రమలో ఆసక్తి మొదలైనది. అటు అభిమానుల్లోనూ , ఇటు సినీ
ప్రియులలో పవన్ కృష్ణుడి గెటప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటె
పవన్ కళ్యాణ్ కృష్ణుడి గెటప్ ఒకటి ప్రస్తుతం నెట్లో హాల్ చల్ చేస్తున్నది.
పవన్ గోపాల గోపాల సినిమాలో మోడరన్ కృష్ణుడిగా నటిస్తున్న విషయం మనకు
తెలిసిందే. హిందీ సినిమా ఓ మై గాడ్ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన
పాత్రని తెలుగులో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.
ప్రస్తుతం మీరు పైన చూస్తున్న పోటో సోషల్ మీడియాలో హల్
చల్ చేస్తుంది. గోపాల గోపాల షూటింగ్ గ్యాప్ లో పవన్ తో కలసి కొందరు
అభిమానులు ఫోటోలు దిగారు. అభిమానుల మొబైల్ ఫోన్స్ నుంచి ఈ ఫోటో లీక్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ కనిపిస్త్న్న ఈ ఫోటోలో లేత గులాభి రంగు షర్ట్ పైన నల్ల కోటుతో
పవన్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ లుక్ గోపాల గోపాల సినిమాలో ఇలాగే ఉండొచ్చని
పరిశ్రమలోని వారు ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్
హైదరబాద్ లో జరుగుతున్నది .
Post a Comment