GuidePedia

0

త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమాలో రాశి ఖాన్నా !

'ఊహలు గుసగుస లాడే' సినిమా ద్వారా పేరు తెచ్చుకున్న రాశిఖన్నా జాక్ పాట్ కొట్టింది. ఎకాఎకీన అల్లు అర్జున్ సరసన నటించే అవకాశాన్ని ఈ అందాలభామ సొంతం చేసుకుంది. అది కూడా పెద్ద దర్శకుని సినిమాలో కావడం ఇక్కడ విశేషం!అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఇందులో ముగ్గురు కథానాయికలు నటిస్తారు. వీరిలో ఇప్పటికే సమంతా, ఆదా శర్మ ఎంపిక కాగా, మూడో అమ్మాయిగా రాశీని ఎంచుకున్నట్టు సమాచారం.మొదట్లో ఈ పాత్ర కోసం ప్రణీతను అనుకున్నప్పటికీ, వెంటనే ఆమెను రిపీట్ చేయడం (అత్తారింటికి దారేదిలో నటించింది) ఇష్టం లేక త్రివిక్రమ్ తాజాగా ఆమె స్థానంలో రాశీని తీసుకున్నాడట.

Post a Comment

 
Top