మహేష్ తో శంకర్ 100 కోట్ల మూవీ ?
తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన
సినిమా కూడా ఇంతవరకు 100 కోట్లు వసూలు చేయలేదు. అలాంటి నేపథ్యంలో
మహేష్ బాబు సినిమాకి 100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి 14
రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ముందుకు వచ్చింది. మహేష్ తో గతంలో 'దూకుడు', '1' చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ, ఇప్పుడు మహేష్ తోనే 'ఆగడు' చిత్రాన్ని
నిర్మిస్తున్న సంగతి విదితమే.అయితే, మహేష్ హీరోగా వంద కోట్ల
భారీ చిత్రాన్ని నిర్మించాలన్న ప్లానింగుతో ఈ సంస్థ అతనికి ఆఫర్ ఇచ్చిందట. అయితే,
ఇక్కడ ఒకే ఒక షరతు ఏమిటంటే, ఆ చిత్రానికి తమిళ
అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించాలన్నది!ఇటీవల 'ఆగడు'
సినిమా ఆడియో వేడుకకు వచ్చిన శంకర్, మహేష్ ల
మధ్య, కలసి సినిమా చేయాలన్న విషయం చర్చకు వచ్చిందన్న
నేపథ్యంలో 14 రీల్స్ సంస్థ ఈ ఆఫర్ ఇచ్చింది. శంకర్ -మహేష్
కాంబినేషన్ అంటే విపరీతమైన క్రేజ్ వస్తుంది. తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా భారీగా బిజినెస్ అవుతుంది. హిందీ అనువాదం నుంచి కూడా మంచి
ఆఫర్ వుంటుంది. వీటన్నిటినీ లెక్కలేసుకునే ఈ సంస్థ ఇలాంటి ఆఫర్ ఇచ్చిందనేది
అందరికీ తెలిసిందే. ఈ ప్రాజక్టుకు మహేష్ ఎలాగూ రెడీనే ... మరి, శంకర్ సిద్ధమేనా? అన్నదే ఇక్కడ ప్రశ్న!
Post a Comment