GuidePedia

1

పవన్ కళ్యాణ్ పై షాకింగ్ న్యూస్ !!

పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న గోపాల గోపాల సినిమాపై ప్రస్తుతం ఓ షాకింగ్ న్యూస్ ఫిలింనగర్లో సందడి చేస్తున్నది. పవన్ కళ్యాణ్ వలన ఓ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని ఇప్పటి వరకు అతని కెరీర్లో విపించలేదు. కానీ పవన్ ని టార్గెట్ చేస్తూ గోపాలుడి సినిమాపై రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. గతంలో పవన్ సినిమాల నిర్మాణం కొద్దిగా ఆలస్యం అయిన గబ్బర్ సింగ్ సినిమా నుంచి వేగాన్ని పెంచాడు.అత్తారింటికి దారేది సూపర్ హిట్ తో పవన్ మరింత వేగం పెంచుతాడు అనుకుంటే ఆ సినిమా విడుదలై ఏడాది అవుతున్నా రకరకాల కారణాలతో పవన్ ఒక్క సినిమా మొదలుపెట్టి పూర్తి చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం అతను నటిస్తున్న గోపాల గోపాల షూటింగ్ లో పవన్ ప్రవర్తన అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పుకార్లు సందడి చేస్తున్నాయి. ఈ సినిమా సెట్లో పవన్ ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడని , ఎప్పుడు లేని విధంగా షూటింగ్ సన్నివేశాల చిత్రీకరణ విషయంలో ఆసక్తి చూపడం లేదనే వార్తలు సందడి చేస్తున్నాయి.
అంతేకాదు ఈ సినిమాలో వెంకటేష్ తో ఉన్న కాంబినేషన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో అరగంట సెట్లో ఉంటె దాదాపు 3-4 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . అసలు పవన్ ఎందుకు ఇంత అసౌకర్యంగా ఉంటున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదట , షేడ్యుల్స్ మారుతున్న , షూటింగ్ ముందుకు కదలకపోవడంతో మిగిలిన నటీనటుల డేట్స్ వృధా అవుతున్నాయని ఈ సినిమా యూనిట్ వారు సైలెంట్ మోడ్ లో ఉన్నారని టాక్. ఈ సినిమాలో పవన్ చేసేది 40 నిమిషాలే అయిన షూటింగ్ కి ఇంకా ఎన్ని రోజులు అవుతుందో తెలియక ఈ సినిమా యూనిట్ సభ్యులు సతమతమవుతున్నారు అనే అనే వార్తలు విపిస్తున్నాయి.


Post a Comment

 
Top