GuidePedia

0




చేకోడి రేటింగ్  :   2.75 /5
చిత్రం  :  ఆగడు
బ్యానర్  : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
దర్శకుడు  : శ్రీను వైట్ల
నిర్మాత  : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
సంగీతం  : ఎస్.ఎస్. థమన్
ఛాయాగ్రహణం  : కే వి గుహన్
ఎడిటర్  : యం ఆర్ వర్మ
నటినటులు  : మహేష్ బాబు, తమన్నా, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సోను సుద్, వెన్నెల కిశోర్ తదితరులు...
ఈ సంవత్సరం ప్రారంభంలో 1 నేనొక్కడినేగా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన మహేష్ ఈ సారి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దూకుడుని అందించిన శ్రీను వైట్లతో కలసి ఈ సారి ఆగడుగా మన ముందుకు వచ్చాడు. తమన్నాతో కలిసి మహేష్, శ్రీను వైట్లలు మళ్ళి తమ దూకుడు చూపించారా లేక చతికల పడ్డారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 

కథ :  అనాధ అయిన శంకర్(మహేష్ బాబ) ను పోలీస్ ఇన్స్పెక్టర్ రాజారావు (రాజేంద్ర ప్రసాద్) పెంచుతాడు ,శంకర్ ని తప్పకుండ పోలీస్ గా చేస్తానని చెప్తాడు, అయితే అనుకోని కారణాలవల్ల తన సోదరిడిని రక్షించండానికి చేయని నేరాన్ని తన ఫై వేసుకొని బాల నేరస్తుల ఖారాఘరానికి (జైలు) కి వెళ్తాడు , అక్కడ శ్రద్ధగా చదువుకొని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. బుక్కపట్నంలో ఉన్న పవర్ ప్రాజెక్ట్ కట్టేందుకు దామోదర్ (సోనూసూద్) అనే వ్యక్తి ప్రయత్నాలు జరుపుతాడు. అతనికి అడ్డుగా నిలిచినా వారిని ఎటువంటి సాక్షాధారం లేకుండా హతమరుస్తుంటాడు. పెద్ద రౌడీ అయిన దామోదర్ అంతు చూసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు శంకర్ ని బుక్కపట్నం ట్రాన్స్ ఫర్ చేస్తారు. దాంతో పోలీస్ గా కాకుండా , వ్యక్తిగతంగా కూడా దామోదర్ పై పగ తీర్చుకునేందుకు సిద్దం అవుతాడు శంకర్. అసలు శంకర్ కు దామోదర్ పై వ్యక్తిగతంగా ఉన్న పగ ఏంటి? పవర్ ప్రాజెక్ట్ ని శంకర్ ఎలా అడ్డుకున్నాడు? అసలు తమన్నా పాత్రా ఏమిటి? వీరిద్దరి మధ్య ఎటువంటి సన్నివేశాలు తెరకేక్కాయి ? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే తప్పకుండా సినిమా చూడాల్సిందే.

హీరో :  మహేష్ నటన ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది . ఈ సినిమాలో కామెడీ పంచ్ లతో ప్రేక్షకులని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు మహేష్. కానీ కొత్త రచయితలు మాత్రం మహేష్ కు సరిపోయే పవర్ ఫుల్ డైలాగ్స్ రాయడంతో విఫలం అయ్యారు. తన పరిధిలోనే మహేష్ నటించి ప్రేక్షకులని మెప్పించాడు. 

హీరోయిన్లు : తమన్నాకు పెద్దగా ఎక్కడ నటించే ఆస్కారం లేకుండా ఉన్నది ఆమె రోల్. కేవలం ఈమెని పాటలకే పరిమితం చేశారు. 
ఇతరులు :  విలన్ గా నటించిన సోనూసూద్ పాత్ర కూడా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకునేలా లేదు. ఇక బ్రహ్మనందం ఢిల్లీ సూరి పాత్రలో సినిమా చివర్లో బాగా నవ్వించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రాహ్మి వేసిన డాన్స్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక నాజర్ ,రాజేంద్రప్రసాద్ , అజయ్, రఘుబాబు , పోసాని , ప్రభాస్ శ్రీను , వెన్నెల కిషోర్ ,  వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం : శ్రీనువైట్ల దర్శకత్వం , స్క్రీన్ ప్లే ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు . తన గత చిత్రాల్లోని పాటలను మరోసారి వినిపించినట్లు అనిపిస్తుంది. ఇక ఈయన బ్యాక్ గ్రౌండ్ స్కోప్ పెద్దగా మెప్పించే విధంగా లేదు. ఇక సినిమాటోగ్రాఫీ మాములుగానే ఉన్నది. ఎడిటింగ్ లో అయితే చాలా లోపాలు ఉన్నాయి.  నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి. కొత్త రచయితల డైలాగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు.

ప్లస్ పాయింట్స్ : 


·        మహేష్ బాబు

·        తోలి భాగo 

డ్రా బాక్స్ :


·        రొటీన్ కథ

·        సంగీతం

·        కధనం

·        మాటలు

చివరిగా :  దూకుడు కాంబినేషన్ లో ఆగడు సినిమా రాబోతుందనగానే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అంచనాలను ఏమాత్రం ఈ సినిమా ఏమాత్రం అందుకోలేకపోయిది . శ్రీనువైట్ల మొదటిసారిగా  గోపి మోహన్ ,కోన వెంకట్ ల  సహకారం లేకుండా చేసిన ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ , స్క్రీన్ ప్లే ఏమాత్రం ప్రేక్షకులని మెప్పించేలా లేవు. కామెడీతో నడిపించే ప్రయత్నం చేసినప్పటికీ అందులో కూడా శ్రీనువైట్ల సక్సెస్ కాలేకపోయాడు. ఇక ఈ సినిమాలో చివర్లో బ్రహ్మానందం కామెడీ అంతో ఇంతో నవ్వించే విధంగా ఉన్నది. అయితే అది కేవలం సెకండ్ హాఫ్ కే పరిమితం అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో వెన్నల కిషోర్ , ప్రభాస్ శ్రీను , పోసానిలతో కామెడీ పండించే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాలో మహేష్ బాబు నుంచి శ్రీనువైట్ల పెద్దగా నటనను రాబాట్టలేకపోయాడు. పరిశ్రమలో హిట్ అంటూ ప్రచారం చేసుకున్న అభిమానులకు ఈ సినిమా షాక్ ఇస్తుంది. ఈ సినిమా మాములు ప్రజలనే కాకుండా మహేష్ అభిమానులను కూడా నిరుస్తాహపరుస్తుంది.

ట్యాగ్ లైన్: గబ్బర్ సింగ్ + దూకుడు = ఆగడు

Post a Comment

 
Top