సన ఖాన్ అరెస్ట్ అయింది !!
ఓ మీడియా
కన్సల్టెంట్‑ను బెదిరంచిన కేసులో బాలీవుడ్ నటి సనా ఖాన్‑ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె గతంలో కళ్యాణ్ రామ్ కత్తి,
మంచు మనోజ్-తో మిస్టర్ నూకయ్య సినిమాలు చేసింది. సనా ఖాన్‑తో పాటు ఆమె బాయ్‑ఫ్రెండ్
ఇస్మాయిల్ ఖాన్ వారి సహాయకుడు రాము
కనోజియాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. సనా ఖాన్‑కు సంబంధించి ఓ వార్త ఇటీవల ప్రచురితమైంది. పూనమ్
ఖన్నా అనే మీడియా కన్సల్టెంట్ ఈ వార్తను
అందించిందని భావించిన సనా ఖాన్, ఇస్మాయిల్ ఆమెను బెదిరించి అనుచితంగా ప్రవర్తించారు. పూనమ్ ఫిర్యాదు
మేరకు సనా ఖాన్, ఇస్మాయిల్‑పై కేసు నమోదు చేసినట్లు
పోలీసులు తెలిపారు.
Post a Comment