GuidePedia

0



చేకోడి రేటింగ్  :  2.5/5
చిత్రం  :  కరెంట్ తీగ
బ్యానర్  : 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ
మాటలు : కిషోర్ తిరుమల
సంగీతం  : అచ్చు
ఛాయాగ్రహణం  : సతీష్ ముత్యాల
ఎడిటర్  : యస్ ఆర్ శేకర్
నిర్మాత  : మంచు విష్ణు
దర్శకుడు  : జి నాగేశ్వర రెడ్డి
నటినటులు  : మంచు మనోజ్, రాకుల్ ప్రీత్, జగపతి బాబు, సన్నీ లియోన్, తనికెళ్ళ భరణి, ‘వెన్నెల’ కిషోర్, రఘు బాబు, పృద్వీ, ధనరాజ్, ‘తాగుబోతు’ రమేష్  తదితరులు
మంచు మనోజ్ చెప్పుకోవడానికి పెద్ద హిట్స్ లేకపోయినా యూత్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఏర్పాటు చేసుకొని మంచి ఫాన్స్ ని ఫాం చేసుకున్నాడు. మనోజ్ ఈ సారి కామెడీ, రీమేక్ సినిమాలు తీయడంలో మాస్టర్ అయిన జి. నాగేశ్వర రెడ్డితో కలసి ఓ తమిళ్ రీమేక్ సినిమా తో వచ్చారు. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సన్నీ లియోన్ గ్లామార్ టచ్ తో ఓపెనింగ్స్ తెచ్చుకోవాలని చుసిన దర్శక,నిర్మాతల ప్రయత్నం ఇప్పుడు చూద్దాం...

కథ :  పార్వతిపురం అనే ఊరిలో పెద్ద మనిషిగా చలామణి అవుతుంటాడు శివరామరాజు (జగపతిబాబు). ఆయనకు ముగ్గురు కూతుళ్లు. అయన చిన్న కూతురు కవిత (రకుల్‌). ఆమె పుట్టిన సందర్బంలో శివరామరాజుకు, ఆ ఊళ్లో ఉండే వీర్రాజు (సుప్రీత్‌)కు మద్య కవిత విషయంలో మాట పట్టింపులోచ్చి గొడవ జరిగి శివరామరాజు, వీర్రాజు చెవి కొస్తాడు. అనంతరం వీరిద్దరు ఓ పందెం వేసుకుంటారు. తన కూతుళ్లలలో ఏవరైనా తనమాట కాదని వేరె వారితో పెళ్లికి సిద్దమయితే వారిని చంపటం కానీ, తాను చెవులు కోసుకోవటం కానీ చెస్తానని శివరామరాజు మాటిస్తాడు. తీరా కవిత వయస్సుకొచ్చిన అనంతరం ఈ ఊరిలో ఉండే రాజు (మనోజ్‌)తో ప్రేమ వ్యవహారం నడుపుతుంది. ఈ విషయం తెలిసిన శివరామరాజు రాజుని చంపాడా. తన మాటని ఏలా నిలబెట్టుకున్నాడనేది తెరమీద చూడాల్సిందే.

నటినటులు :  మనోజ్‌ తనకున్న చురుకుదనానికి తగ్గ రోల్‌నే మరోసారి ఈ సినిమాలోనూ పోషించాడు. బేవర్స్‌ గ్యాంగ్‌ కు విఐపి సంఘం అన్న పేరెట్టుకుని హాడావుడి చెసే రాజుగా మనోజ్‌ నటన ఎప్పటిలాగే  ఓవర్ అయింది.  యాక్షన్‌ సన్నివేశాల్లో ఇరగదీసినా మనోజ్ సెంటిమెంట్‌ సీన్స్‌ లో మాత్రం తెలిపోయాడు.
 
శివరామరాజుగా జగపతిబాబు సీరియస్‌నెస్‌తో పాటు కామెడీ కూడా చేశాడు. అయితే సీరియస్‌ సీన్ అనుకున్న ప్రతిసారి తన జీరగోంతెసుకోని అరవటం ఏం బాలేదు అయన పాత్ర కూడా హీరో,దర్శకుడు చెప్పినంతగా లేదు.

రకుల్‌ప్రీత్ కవిత గా ఈ సినిమాకు మంచి కలరింగ్ అద్దింది. తన గత రెండు చిత్రాలకంటే రకుల్ ఈ సినిమాలో కొంచం అందంగా కనిపించింది. టీనేజ్‌ అమ్మాయిగా ఆమె నటన క్యూట్‌ గా ఉంది.

ఇక సన్నీ లియోన్ ని కేవలం పబ్లిసిటీ, ఓపెనింగ్స్ కోసమే ఆమెను వాడుకున్నారు, మిగతా పాత్రలలో పృథ్వీ ప్రతిసారి పెళ్లి చెడిపోయే ముదురు పెళ్లికొడుకుగా నవ్వించాడు. తనికేళ్ల భరణి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, ధనరాజ్ ఇలా చెప్పకోటానికి చాలా పాత్రలున్నా... వారి నటన,కామెడీ సాదాసీదాగానే ఉంది.

సాంకేతిక వర్గం : అచ్చు అందించిన సంగీతంలో పాటలు వినడానికి బాగున్నా కూడా తెర మీదకి వచ్చేసరికి ఆకట్టుకోలేదు నేపధ్య సంగీతం మాత్రం సన్నివేశం ఎలా ఉన్నా సరే నేపధ్య సంగీతం బాగుంది అనిపించుకునేలా ఇచ్చారు. కిషోర్ తిరుమల సంభాషణలు మాస్‌ను ఆకట్టుకునేలా వున్నాయి మినహా ప్రత్యేకత ఏమీలేదు ప్రాస కోసం చాలా దూరం పరిగెత్తి అలిసిపోయారు, పవర్ ఫుల్ సన్నివేశాల వద్ద కూడా అయన డైలాగ్స్ పేలవంగా ఉండటంతో సన్నివేశాలు తేలిపోయాయి. సతీష్ సినిమాటోగ్రఫీ ఏవరేజ్‌గా వుంది ఇయన హీరోయిన్ ని మరియు సన్నీ లియోన్ ని మాత్రమే అందంగా చూపించగలిగారు. ఎడిటింగ్‌ సోసోగా వుంది. మంచు మనోజ్ అందించిన స్టంట్స్ బాగున్నాయి కాని సన్నివేశాలలో బలం లేకుండా వచ్చిన ఈ పోరాట సన్నివేశాలు మరియు స్టంట్స్ చిత్రానికి సహాయ పడలేదు. దర్శకుడిగా జి నాగేశ్వర్ రెడ్డి గతంలో సీమ శాస్త్రి, దేనికైనా రెడీ వంటి చిత్రాలలో కామెడీ బాగా పండించారు కాని ఈ చిత్రం విషయంలో తేలిపోయారు.

ప్లస్ పాయింట్స్ :
·        అచ్చు సంగీతం
·        రకుల్, సన్నీ గ్లామర్
·        స్టంట్స్

డ్రా బాక్స్ :
·        కథనం, మాటలు
·        అనవసరపు కారెక్టర్లు
·        ఎడిటింగ్

విశ్లేషణ :  తమిళంలో శివ కార్తికేయన్ నటించిన ‘వరుతపడాద వాలిబర్ సంఘం’ అనే సూపర్ హిట్ సినిమాకి ఇది రీమేక్ అందులో ఉన్న కథనే తీసుకొని చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. మన తెలుగు కబ్బతి అదనపు ప్రతినాయకుడిని తీసుకురావడం అవసరమే లేని చోట ఫైట్ లు పెట్టించడం లాంటి "ఎక్స్ట్రా" పనులు చేసారు. అక్కడ ఎలా ఉందో అలానే కథనం రాసుకొని ఉంటె ఈ చిత్రం కాస్త బాగుండేది ఏమో, కాని చాలా మార్పులు చేసేసి అనవసరమయిన సన్నివేశాలను జత చేసేసి ప్రేక్షకుడిని చిరాకు పెట్టించేసారు.  చిత్రంలో రెండు రకాల సన్నివేశాలు ఉన్నాయి ఒకటి తమిళంలో ఉన్నదీ ఉన్నట్టు గా తీయడం, రెండోది సొంత సన్నివేశాలను తియ్యడం తమిళంలో ఎలా ఉందో అలానే తీసిన అన్ని సన్నివేశాలు చాలా బాగా పేలాయి కాని స్వంతంగా రాసుకున్న సన్నివేశాలన్నీ విఫలం అయ్యాయి.. ముఖ్యంగా కేవలం హీరోతో  ఫైట్ చెయ్యడం కోసం మాత్రమే పెట్టుకున్న విలన్ పాత్ర ఎందుకు ఉందో ఆ పాత్రకే ఒక ఐడియా ఉండదు.. రకుల్ ప్రీత్ చేత నటన బయట పెట్టకుండా అందాలను బయటపెట్టించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు... అలాగే సన్నీ లియోన్ పాత్రని కూడా.. ఈ సినిమాలో అన్ని ఉన్నాయి కాని అవి సరిపడే స్థాయిలో లేదు .. తమిళంలో చూడకపోయి ఉంటె ఒకసారి ప్రయత్నించండి, తమిళ చిత్రం చూసిన వారు మరోసారి తమిళ చిత్రాన్ని చూడటమే మంచిది..

చివరగా – కరెంట్ తీగ చుస్తే షాకే

Post a Comment

 
Top