ప్రభాస్
హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తొలిసారిగా ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గత
కొంత కాలంగా 'బాహుబలి' సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఇక ఆ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు. 'బాహుబలి' యాక్షన్ సినిమా కావడంతో ఈసారి ఫ్యామిలీ డ్రామాతో సాగే వినోదాత్మక
చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నాడట.ఈ కోవలో
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని భావిస్తున్నాడు. ఇందుకు త్రివిక్రమ్ కూడా సంసిద్ధతను
వ్యక్తం చేసినట్టు, ఇద్దరి మధ్యా దీనికి సంబంధించి
చర్చలు కూడా జరిగినట్టూ చెబుతున్నారు. అల్లు అర్జున్ తో తాను చేస్తున్న చిత్రం పూర్తి కాగానే దీనిపై
త్రివిక్రమ్ దృష్టి పెడతాడట.
Subscribe to:
Post Comments (Atom)
Post a Comment