GuidePedia

0


హీరోల కోసం వెతుకుతున్న బూతు డైరెక్టర్ !!

బూతు డైలాగ్స్, వల్గారిటిని ఎక్కువగా చూపించే డైరెక్టర్ గా మంచి పేరున్న మారుతికి కష్టాలు వచ్చాయి. పేరుకు తగ్గట్లు సినిమాలు చేయకపోవటంతో... ఈయన బూతు డైరెక్టర్ అని అంతా డిసైడ్ చేశారు. దీంతో ఈయనతో సినిమాలు చేసేందుకు ప్రస్తుత హీరోలు కాస్త వెనకాడుతున్నారట. డబుల్ మీనింగ్ డైలాగులతో కధలు సిద్ధంగా ఉన్నా... హీరోలు లేరే అని మారుతి దిగులుపడుతున్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. దీంతో హీరోల కోసం వెతుకులాట మొదలు పెట్టాడని అంతా అంటున్నారు. చేసింది చిన్న సినిమాలే అనుకున్నా.., ప్రముఖ దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ కాన్సెప్ట్ అయితే హిట్ ఇచ్చిందో అదే ఎక్స్ట్రా మాటలు, చేతలు ఆయనకు పరాజయాలు కూడా అందించాయి. యూత్ ను అట్రాక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో చేసిన కొన్ని ప్రయోగాలు ఇలాగే బెడిసికొట్టాయి. అటు వెంకటేష్, నాని, నితిన్ తో చేయాల్సిన సినిమాలు వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి. వీరి ప్రాజెక్టులు నిలిచిపోవటం డైరక్టర్ కు మైనస్ అయింది. ఇలాంటి సినిమాల్లో నటిస్తే చెడ్డపేరు వస్తుందనే వారు దూరంగా ఉన్నట్టు టాక్.



Post a Comment

 
Top